గర్భిణులకు సకాలంలో టీకాలు వేయాలి

ABN , First Publish Date - 2023-01-25T23:06:45+05:30 IST

గర్భిణులు, చిన్నారుల కు సకాలంలో వ్యాధినిరోధక టీకాలు తప్పక వే యాలని జిల్లా వ్యాధినిరోధక టీకాల అధికారి డాక్ట ర్‌ ఉషశ్రీ సిబ్బందిని ఆదేశించారు.

గర్భిణులకు సకాలంలో టీకాలు వేయాలి
రికార్డులు పరిశీలిస్తున్న డాక్టర్‌ ఉషశ్రీ

జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి ఉషశ్రీ

ఓబులవారిపల్లె, జనవరి 25: గర్భిణులు, చిన్నారుల కు సకాలంలో వ్యాధినిరోధక టీకాలు తప్పక వే యాలని జిల్లా వ్యాధినిరోధక టీకాల అధికారి డాక్ట ర్‌ ఉషశ్రీ సిబ్బందిని ఆదేశించారు. వ్యాధి నిరోధక టీకాల అధికారి వైద్య సేవాకేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లలు, గర్భిణులకు వ్యాధి నిరోధక టీకాల రిజిస్టర్లను పరిశీలించారు. వ్యాక్సిన్‌పై పలు సూచనలు సలహాలు ఇచ్చారు. టీకాలు, వ్యాక్సిన్లకు సంబంధించిన వాడకం గడువును గమనించాలని సూచిం చారు. కార్యక్రమంలో డాక్టర్‌ దీప, సీహెచ్‌ఓ నగేశ్‌, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

పుల్లంపేటలో....

పుల్లంపేట, జనవరి25: వ్యాధినిరోధక టీకాల అధికారి డాక్టర్‌ ఉషశ్రీ స్థానిక పీహెచ్‌సీలో వైద్యాధికారులు, సిబ్బందితో సమావేశమై సచివాలయాల వారీ టీకాల వినియోగం, జాగ్రత్తపై సమీక్షించారు. గర్భిణులు నాలు గు సార్లు వైద్య పరీక్షలు చేయించుకునేలా సిబ్బంది చొరవ చూపాలని, బర్త్‌ ప్లాన్‌, ఐరన్‌ మాత్రలు, కాల్షియం మాత్ర లు అందించాలని, చిన్నపిల్లల టీకాలు డోసుల వారీ పూర్తి చేయాలని సూచించారు. ప్రమాదకర ప్రసవ గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. గర్భనిరోధక పద్దతులు పీఎంఎంవీవై పథకంలో భాగంగా అర్హులైన లబ్ధిదారుల రికార్డులు పరిశీలించారు. డాక్టర్‌ సానె శేఖర్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T23:06:45+05:30 IST