పోరుమామిళ్ల చెరువు తూములు ఎత్తివేత
ABN , First Publish Date - 2023-06-23T23:21:08+05:30 IST
పోరుమామిళ్ల చెరువుకు సంబంధించి రైతులకు అందించాల్సిన నీరు వృథాగా పోతుండడంతో అనేక విమర్శలకు తావిస్తోంది.
వృథాగా పోతున్న నీరు
పట్టించుకోని అఽధికారులు
పోరుమామిళ్ల, జూన్ 23: పోరుమామిళ్ల చెరువుకు సంబంధించి రైతులకు అందించాల్సిన నీరు వృథాగా పోతుండడంతో అనేక విమర్శలకు తావిస్తోంది. పోరుమామి ళ్ల చెరువు నుంచి బద్వేలు, చుట్టు పక్కల చెరువులకు నీరు సరఫరా అయ్యేది. ప్రస్తు తం ఈ చెరువు ఆయకట్టు అధికారికంగా 4వేలకు పైగా ఉన్నా అనధికారికంగా దా దాపు పదివేల ఎకరాలు ఆయకట్టు ఉంది. రంగసముద్రం చెరువుకు, రెడ్డికతవకు ఈ చెరువు ద్వారానే నీటి సరఫరా అవుతోంది. ప్రస్తుతం చెరువు కింద రైతులు పైర్లు వేసే పరిస్థితి కనిపించడంలేదు. పొలానికి చాడ కట్టాలన్నా ఎవరూ ముందుకు రావడంలేదు.
వర్షాలు వచ్చిన తరువాత అదును బట్టి చూద్దాంలే అన్న ఆలోచనలో ఉండగా పెద్ద తూము షట్టర్లు ఎవరో ఎత్తడంతో చెరవులో నీరంతా కాల్వల ద్వారా పొలాలను చుట్టుముడుతన్నాయి. రైతులకు ఉపయోగపడాల్సిన నీరు వృథాగా పోతున్నా సంబంధిత అధికారుల నుంచి స్పందన కరవైంది. చేపల వ్యాపారుల పనిగా అనుమానాలు తలెత్తుత్తున్నాయి. రైతుల పొలాలకు ఉపయోగపడాల్సిన చెరువు నీరు వృథా గా పోతుండడంతో రైతులు పెదవి విరుస్తున్నారు. ఈ విషయమై తెలుగుగంగ ఏఈ రవిచంద్రను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరు.