పోలవరం ప్రాజెక్టు పూర్తి కోసమే పోరుకేక

ABN , First Publish Date - 2023-06-18T23:10:11+05:30 IST

పోలవరం ప్రాజెక్టు ముంపవాసులకు పునరావాసం తో పాటు పనులు వెంటనే పూర్తిచేయా లన్న డిమాండ్‌తో పోరుకేక చేపడుతున్న ట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు పేర్కొన్నారు.

పోలవరం ప్రాజెక్టు పూర్తి కోసమే పోరుకేక
పోరుకేక పోస్టర్‌ విడుదల చేస్తున్న సీపీఎం జిల్లాకార్యదర్శి శ్రీనివాసులు

్ఠ

మదనపల్లె అర్బన, జూన 18: పోలవరం ప్రాజెక్టు ముంపవాసులకు పునరావాసం తో పాటు పనులు వెంటనే పూర్తిచేయా లన్న డిమాండ్‌తో పోరుకేక చేపడుతున్న ట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ నెల 20న భద్రాచలం వద్ద ఏటపాక నుంచి పాదయాత్ర మొదలై 15 రోజులపాటు ముంపుప్రాంతాలను కొన సాగుతూ జూలై 4 వతేదీకి విజయవాడ చేరుకుంటుందని ఆయన తెలిపారు. ఆ మేరకు ఆదివారం పోలవరం పోరుకేక పోస్టర్‌ ను మదనపల్లె మార్కెట్‌ యార్డు వద్ద ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం లైడార్‌ సర్వేతో మరో 36 గ్రామాలను అదనంగా చేర్చిందే తప్ప పూర్తి ముంపు తేల్చలేదని తెలిపారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు పునరా వాస పనుల్లో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు వలన లక్షలాది మంది ప్రజలు నిర్వాసితులయ్యారని, వారి సమస్యలపై సీపీఎం ఆధ్వర్యంలో పోలవరం పోరుకేక పేరుతో భారీ పాదయాత్ర చేపడుతునున్నట్లు తెలి పారు. పోలవరం పునరావాసానికి రూ. 32 వేల కోట్లు అవసరం కాగా కేవలం రూ. 7 వేల కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు ప్రభాకర్‌రెడ్డి, వెంకటేష్‌, సురేంద్ర, నాగరాజు, రామకృష్ణ, పవనకుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-18T23:10:11+05:30 IST