పోలీసు సిబ్బందికి ఆత్మరక్షణ అవసరం
ABN , First Publish Date - 2023-07-21T23:56:10+05:30 IST
పోలీసు సిబ్బందికి ఆరోగ్యం, ఆత్మర క్షణ ఎంతైనా అవసరమని మదనపల్లె డీఎస్పీ కేశప్ప పేర్కొన్నారు.
మదనపల్లె అర్బన, జూలై 21: పోలీసు సిబ్బందికి ఆరోగ్యం, ఆత్మర క్షణ ఎంతైనా అవసరమని మదనపల్లె డీఎస్పీ కేశప్ప పేర్కొన్నారు. అన్నమ య్య జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ ఆదే శాల మేరకు మదనపల్లె సబ్ డివజన ల్ పోలీసు కార్యాలయ ఆవరణలో మద నపల్లె సబ్ డివిజనల్ పోలీస్ సిబ్బందికి వీక్లీ పెరేడ్ సందర్భంగా శారీరక దారుఢ్యం, ఆత్మరక్షణకు సంబంధించి విధి నిర్వహ ణలో అప్రమత్తంగా ఉండగానికి మదనపల్లె యూత కరాటే క్లబ్ అసోసియేషన వ్యవ స్థాపకుడు డాక్టర్ ఏఆర్ సురేష్ వారి బృందంతో సుమారు గంట పాటు శారీరక దారు ఢ్యానికి సంబంధించి మెలకువలు తెలియజేశారు. మదనపల్లె డీఎస్పీ కేశప్ప మాట్లాడు తూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే చక్కటి ఆరోగ్యం కలిగి ఉండవ చ్చన్నారు. కార్యక్రమంలో సీఐలు ముర ళీకృష్ణ, సత్యనారాయణ, శివాంజనేయులు, ట్రాఫిక్ ఇనచార్జి ఇనస్పెక్టర్ కృష్ణయ్య, ఎస్‌ఐ సుబ్బారెడ్డి, పోసులు పాల్గొన్నారు.