మంత్రి రోజాపై పోలీసులకు ఫిర్యాదు
ABN , First Publish Date - 2023-09-21T23:58:42+05:30 IST
సభ్య సమాజం తలదించుకునేలా, ము ఖ్యంగా స్ర్తీలకు చెడ్డ పేరు తెచ్చే లా ప్రవర్తిస్తున్న మంత్రి రోజాపై చర్యలు తీసుకోవాలని జనసేన నాయకులు వనటౌన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మదనపల్లె, సెప్టెంబరు 21: సభ్య సమాజం తలదించుకునేలా, ము ఖ్యంగా స్ర్తీలకు చెడ్డ పేరు తెచ్చే లా ప్రవర్తిస్తున్న మంత్రి రోజాపై చర్యలు తీసుకోవాలని జనసేన నాయకులు వనటౌన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందులో భాగంగా జనసేన రాయలసీమ కో-కన్వీనర్ గంగారపు రామ్‌దాస్‌చౌదరి ఆదేశాల మేరకు ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరామ్ ఆధ్వర్యంలో గురువారం రోజా వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పోలీస్‌స్టేషన ఎదుట నిరసన వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవనకళ్యాణ్‌తోపాటు ప్రతిపక్షపార్టీ నాయకులపై వ్యక్తి గత దూషణలకు దిగుతున్న రోజాపై చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని శివరామ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షుడు నాయని జగదీష్, రూరల్ అధ్యక్షుడు గ్రానైట్ బాబు, పట్టణ ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్, జనరల్ సెక్రటరీలు రెడ్డెమ్మ, గండికోట లోకేష్, సెక్రటరీలు అర్జున, జనార్దన, స్వాతి, చందు, కేశవ, తదితరులు పాల్గొన్నారు.