పందులను శాస్త్రీయ పద్ధతిలో పెంచాలి

ABN , First Publish Date - 2023-05-25T22:57:54+05:30 IST

పందులను శాస్ర్తీయ పద్ధతిలో పెంచాలని కమిషనర్‌ ప్రవీణ్‌చంద్‌ అన్నారు.

పందులను శాస్త్రీయ పద్ధతిలో పెంచాలి
సమావేశంలో మాట్లాడుతున్న కమిషనర్‌ ప్రవీణ్‌చంద్‌

ప్రతి జీవానికి కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో లైసెన్సు నెంబరు

లేని వాటిపై చర్యలు తప్పవు ఫ కమిషనర్‌ ప్రవీణ్‌చంద్‌

కడప (ఎర్రముక్కపల్లె), మే 25 : పందులను శాస్ర్తీయ పద్ధతిలో పెంచాలని కమిషనర్‌ ప్రవీణ్‌చంద్‌ అన్నారు. ప్రతి జీవానికి కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో లైసెన్సు నెంబరును ఇస్తామన్నారు. లేనివాటిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. గురువారం కడప కార్పొరేషన్‌ సమావేశ మందిరంలో పందుల పెంపకందారులు, హెల్త్‌ విభాగం అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనరు మాట్లాడుతూ నగర పరిసర ప్రాంతాల్లో ఉన్న పందులు ప్రజారోగ్యానికి భంగం కలిగిస్తున్నాయన్నారు. ప్రజలకు ఇబ్బందికరంగా మారినందున పలుమార్లు రాతపూర్వకంగా, మౌఖికంగా హెచ్చరించినా పందుల పెంపకందార్లు తమ తీరును మార్చుకోవడంలేదని తెలిపారు. పందుల వల్ల అనేక నష్టాలు కలుగుతున్నాయన్నారు. పందులను కుట్టిన దో మలు మనుషులను కుడితే మెదడువాపు వ్యాధి, ఫ్లూతో పాటు పలు రకాల వైరస్‌ వ్యాప్తి చెంది వ్యాధులు వస్తాయని తెలిపారు. పందులను నివాస ప్రాంతాలకు దూరంగా పెంచాలని సూచించారు. దీనికి పం దుల పెంపకందారులు సహకరించాలని కోరారు. గత ఏడాది నోటీసులో ఇచ్చినా పందులను నగరంలోనే పలు ప్రాంతాల్లో విచ్చలవిడిగా పెంచుతున్నారని, ఇక నుండి పందులను శాస్త్రీయ పద్ధతిలో పెంచాలని హెచ్చరించారు. ప్రతి జీవానికి కార్పొరేషన్‌ ఒక లైసెన్సు నెంబరు ఇస్తుందన్నారు. లైసెన్సు నెంబరు లేని పందులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం పందుల పెంపకందారులు స్పం దిస్తూ ప్రభుత్వ నిర్ణయానికి తాము కట్టుబడతామని తెలిపారు. ఇక ఇళ్లకు దూరంగా పందులు పెంచుకుంటామని తెలిపారు.

Updated Date - 2023-05-25T22:57:54+05:30 IST