ప్రజా ప్రభుత్వమా? కార్పొరేట్‌ ప్రభుత్వమా?

ABN , First Publish Date - 2023-06-26T22:37:45+05:30 IST

రాష్ట్రాన్ని పాలిస్తోంది ప్ర జా ప్రభుత్వమా, కార్పొరేట్‌ అను కూల ప్రభుత్వమా అని సీపీఐ జిల్లా కార్యదర్శి నరసింహులు విమర్శించారు. సోమవారం స్థానిక ఎస్టీ యూ భవన్‌లో పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు.

ప్రజా ప్రభుత్వమా? కార్పొరేట్‌ ప్రభుత్వమా?
మాట్లాడుతున్న సీపీఐ జిల్లా కార్యదర్శి పీఎల్‌ నరసింహులు

26 ఎంపీఎల్‌యూ 5:

మదనపల్లె అర్బన్‌, జూన్‌ 26: రాష్ట్రాన్ని పాలిస్తోంది ప్ర జా ప్రభుత్వమా, కార్పొరేట్‌ అను కూల ప్రభుత్వమా అని సీపీఐ జిల్లా కార్యదర్శి నరసింహులు విమర్శించారు. సోమవారం స్థానిక ఎస్టీ యూ భవన్‌లో పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సంక్షేమ ప్రభుత్వం అని చెప్పి అధి కారంలోకి వచ్చిన జగన్‌ నాలుగేళ్లలో 8 సార్లు విద్యుత్‌ చార్జీలు పెంచాడని గుర్తు చేశారు. విద్యుత్‌ సంస్థలను ప్రైవేట్‌ కార్పొ రేట్‌ సంస్థలకు అప్పగించడానికే ఇలాంటి ఎత్తులు వేస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వమా లేదా కార్పొరే టర్ల ప్రభుత్వమా అని ప్రశ్నించారు. వ్యవ సాయానికి ఉచిత విద్యుత్‌ ఇచ్చేటప్పుడు రూ.30 వేలు పెట్టి స్మార్ట్‌ మీటర్లు బిగించ డం ఎందుకని ప్రశ్నించారు. విద్యుత్‌ చార్జీలతోపాటు పలు రకాలు చార్జీలను ఉపసంహరించుకునే వరకు పోరాటాలు ఆగ వని హెచ్చరించారు. ఈ నెల 30న విద్యుత్‌ సబ్‌ స్టేషన్ల వద్ద సీపీఐ ఆధ్వర్యంలో చేస్తున్న ఆందోళనలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఽకార్యక్రమంలో కృష్ణప్ప ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, జిల్లా సమితి సభ్యులు సలీంబాషా, ఏఐఎస్‌ఎఫ్‌ మదనపల్లె నియోజకవర్గ కార్యదర్శి మాధవ పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T22:37:45+05:30 IST