ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి: పీడీఎ్‌సయూ

ABN , First Publish Date - 2023-06-02T23:29:09+05:30 IST

జిల్లాలో కార్పొరేట్‌, ప్రైవేటు పాఠశాలలు ముందస్తు అడ్మిషన్లు తీసుకుని తరగతులు నిర్వహిస్తున్నాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని పీడీఎ్‌సయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.అంకన్న డిమాండ్‌ చేశారు.

ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న పాఠశాలలపై   చర్యలు తీసుకోవాలి: పీడీఎ్‌సయూ
డీఈఓకు వినతిపత్రం అందిస్తున్న పీడీఎ్‌సయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి అంకన్న

కడప (ఎడ్యుకేషన్‌), జూన్‌ 2 : జిల్లాలో కార్పొరేట్‌, ప్రైవేటు పాఠశాలలు ముందస్తు అడ్మిషన్లు తీసుకుని తరగతులు నిర్వహిస్తున్నాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని పీడీఎ్‌సయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.అంకన్న డిమాండ్‌ చేశారు. శుక్రవారం డీఈఓ కార్యాలయంలో డీఈఓ రాఘవరెడ్డికి ఆయన వినతిప త్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల యాజమాన్యాలు పాఠశాల నిబంధనలకు విరుద్దంగా పెద్దపెద్ద హోర్డింగులు ప్రచారాలతో హోరెత్తుతున్నాన్నారు. ఇప్పటికే కార్పొరేట్‌ పాఠశాలలు సగం అడ్మిషన్లను పూర్తి చేశారన్నారు. అడ్మిషన్లకు పరీక్షలు నిర్వహించకూడదని నిబంధనలు ఉన్నా దానికి విరుద్దంగా ప్రవేశ పరీక్ష కూడా నిర్వహిుస్తున్నారన్నారు. డీఈఓ స్పందిస్తూ అక్రమ అడ్మిషన్లకు అడ్డుకట్ట వేసి వేస్తామన్నారు. కార్యక్రమంలో పీడీఎ్‌సయూ నాయకులు స్వరూ్‌పతేజ, శ్రీహరి, రామ్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-02T23:29:09+05:30 IST