అధికారులూ...మారాలి మీ తీరు!
ABN , First Publish Date - 2023-10-30T23:41:50+05:30 IST
అధికారులు మీ తీరు మార్చుకోవాలని రెవె న్యూ అధికారుల పనితీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తు న్నారు.
రెవెన్యూ అధికారుల అలసత్వంపై ప్రజల్లో అసహనం అర్జీలు ఇవ్వడానికి వచ్చి అవస్థలు తప్పడంలేదంటున్న వైనం
పీలేరు, అక్టోబరు 30: అధికారులు మీ తీరు మార్చుకోవాలని రెవె న్యూ అధికారుల పనితీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తు న్నారు. ఏదైనా సర్టిఫికేటు కావాలంటే వలంటీరు, సచివాల యం, తహసీల్దార్ కార్యాలయమంటూ వారాల తరబడి తిరి గేదానికి సరిపోతా ఉంది తప్ప పనులు జరగడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తహసీల్దార్ కార్యాల యానికి పోతే ఈడికెందుకు మీ సచివాలయం కాడికి పోండి అంటారు. పోనీ పనైనా చేస్తారా అంటే అదీ లేదు. ఎవరికి చెప్పుకోవాలో, ఎలా చెప్పుకోవాలో తెలియడం లేదని వివిధ పనుల నిమిత్తం పీలేరు తహసీల్దారు కార్యాలయానికి వచ్చే ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న సర్టిఫికెట్ల దగ్గర నుంచి పట్టా దారు పాసుపుస్తకాలు, భూసర్వే, జగనన్న కాలనీ గృహాల కేటాయింపు, అందులో ఏర్పడే వివాదాల పరిష్కారం వంటి అనేక అంశాల్లో రెవెన్యూ సిబ్బంది విపరీతమైన జాప్యం చేస్తున్నారన్నారు.
సర్వేయర్ ఉదంతంతో రెవెన్యూ ఉద్యోగుల తీరుపై చర్చలు
పీలేరు సర్వేయర్ రెడ్డప్పపై పెద్దిరెడ్డిగారిపల్లెకు చెందిన సోదరులు అని ల్ రెడ్డి, సునీల్ రెడ్డి దౌర్జన్య కాండ తరువాత రెవెన్యూ ఉద్యోగుల పని తీరుపై విస్తృతంగా చర్చించుకుంటున్నారు. తహసీల్దారు కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే వారికి కనీస సమాధానం చెప్పేవారు ఉండడం లేదని, తహసీల్దారు లేని సమయంలో ప్రజలను పట్టించుకోవ డం లేదని చాలా మంది వాపోతున్నారు. గంటల తరబడి కార్యాల యంలోని చెట్లు, మెట్ల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోందని, చిన్న పని అయినా వారాల తరబడి తిరగాల్సి వస్తోందని బాధపడుతున్నారు.
ఎడతెగని రీతిలో జగనన్న కాలనీ పట్టాలు
పీలేరు మండలంలో ఇప్పటి వరకు సుమారు 12 వేల మందికి జగనన్న కాలనీల ద్వారా ఇళ్లు మంజూరు చేశారు అధికారులు.అయితే అధికా రులు ఆ రోజున కేవలం పదుల సంఖ్యలో పట్టాలు అందజేసి మిగిలిన వారిని తర్వాత రమ్మంటున్నారు. ఒక్కసారి పట్టాల పంపిణీ పూరైన తరువాత ఆ మరుసటి రోజు నుంచి వందలాది మంది లబ్ధిదారులు తమ పట్టా పుస్తకాలు, వాటిలో అధికారుల సంతకాల కోసం రెవెన్యూ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. ఇంటి పట్టా మంజూరు పుస్తకంలో వీఆర్వో, ఆర్‌ఐ, డీటీ, తహసీల్దారు సంతకాలు కావాల్సి ఉంటుంది. ఈ నలుగురూ ఏకకాలంలో కార్యాలయంలో అందుబాటులో ఉండడం చాలా కష్టం. వివిధ పనుల నిమిత్తం వారందరూ తమ తమ పరిధిలో క్యాంపులకు వెళ్లడం పరిపాటి. దీంతో లబ్ధిదారులు వారాల తరబడి రెవెన్యూ కార్యాలయానికి తిరగాల్సి వస్తోంది.
ధ్రువీకరణ పత్రాల మంజూరులోనూ జాప్యం
కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతోపాటు ఇతర పత్రాల మంజూరు లోనూ పీలేరు తహసీల్దారు కార్యాలయంలో విపరీతమైన జాప్యం జరు గుతోందనే విమర్శలు ఉన్నాయి. అత్యవసర సమయాల్లో వాటి కోసం రాజకీయ నాయకుల చుట్టూ తిరగాల్సి వస్తోందని వాపోతున్నారు.
ఉన్నంతలో మెరుగ్గా పనిచేస్తున్నాం
పీలేరు రెవెన్యూ కార్యాలయ సిబ్బంది పనితీరులో జాప్యం ఉంటుందన డం సబబు కాదు. ఇటీవలి కాలం వరకు తగినంత మంది సిబ్బంది లేక ఇబ్బంది పడ్డాం. ఇప్పుడిప్పుడే సిబ్బంది సమకూరారు. ప్రాధాన్యత మేర కు అన్ని పనులు వీలైనంత త్వరగా ముగిస్తున్నాం. అయితే వివిధ పనుల కోసం ప్రభుత్వం నిర్దేశించిన సమయం కంటే ముందుగానే పనులు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇక్కడే సమస్య వస్తోంది. నిర్దేశిత సమయం కంటే ముందు ఏ దరఖాస్తు కూడా ఆనలైనలో ఏమీ చేయలేము. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి. మావైపు చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా సరిదిద్దుకుని ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తాం.
-ధనంజయులు, తహసీల్దారు, పీలేరు