శ్రీవారికి వేడుకగా పవిత్రాల సమర్పణ

ABN , First Publish Date - 2023-09-25T23:30:44+05:30 IST

తంబళ్లపల్లె మండలం కోసు వారిపల్లెలో కొలువైన ప్రస న్న వేంకటరమణ స్వామి ఆలయ వార్షిక పవిత్రోత్స వాల్లో రెండో రోజైన సోమవా రం టీటీడీ ఆధ్వర్యంలో పవిత్ర సమర్పణ వేడుకగా నిర్వహించారు.

శ్రీవారికి వేడుకగా పవిత్రాల సమర్పణ
పవిత్రాలను ఊరేగిస్తున్న టీటీడీ అధికారులు

తంబళ్లపల్లె, సెప్టెంబరు 25: తంబళ్లపల్లె మండలం కోసు వారిపల్లెలో కొలువైన ప్రస న్న వేంకటరమణ స్వామి ఆలయ వార్షిక పవిత్రోత్స వాల్లో రెండో రోజైన సోమవా రం టీటీడీ ఆధ్వర్యంలో పవిత్ర సమర్పణ వేడుకగా నిర్వహించారు. తెల్లవారుజామున వేంకటరమణ స్వామి వారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి అభిషేకం, నైవేద్య హరతులు పూర్తి చేశారు. ఉదయం 10 గంటల నుంచి పట్టు పవిత్రా లను యాగశాల నుంచి మంగళవాయిద్యాలతో ఆలయంలో ఊరేగిం పుగా తీసుకెళ్లి స్వామి వారి మెడలో, శ్రీదేవి, భూదేవీలకు, ధ్వజస్తం భానికి, ప్రసన్న ఆంజనేయ స్వామి వారికి, ఆలయంలో, వెలుపల 12 మంది మూలవర్లకు సమర్పించారు. మూడో రోజైన మంగళవారం మహాపూర్ణాహుతి, పవిత్ర విసర్జన, చక్రస్నానం, విధి ఉత్సవంతో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. కార్యక్రమంలో స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ ఈవో వరలక్ష్మీ, సూపరింటెండెంట్‌ మునిచెంగల్రాయులు, ప్రధాన అర్చకుడు కృష్ణప్రసాద్‌ భట్టర్‌, అర్చకుడు రమేష్‌, వేదపారా యణదారులు అమరనాథ్‌ స్వామి, లక్ష్మీకాంతస్వామి, ఆలయ అఽధికారి దిశంతకుమార్‌, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-25T23:30:44+05:30 IST