దర్జాగా మున్సిపల్ బస్టాండు ఆక్రమణ
ABN , First Publish Date - 2023-03-31T23:19:16+05:30 IST
మదనపల్లె పట్ట ణంలో నిత్యం రద్దీగా వుండే చిత్తూరు బస్టాం డులోని స్థలాన్ని ఓ దుకాణదారుడు ఆక్రమించు కుని ట్రాఫిక్ సమస్యకు కారణమవుతున్నాడు.
మదనపల్లె టౌన, మార్చి 31: మదనపల్లె పట్ట ణంలో నిత్యం రద్దీగా వుండే చిత్తూరు బస్టాం డులోని స్థలాన్ని ఓ దుకాణదారుడు ఆక్రమించు కుని ట్రాఫిక్ సమస్యకు కారణమవుతున్నాడు. స్థానిక బొంతలవారి సత్రం ఎదురుగా ఉన్న మున్సిపల్ బస్టాండులో 10 బస్సులు నిలిపేంత స్థలం మాత్రమే ఉంటుంది. ఇంతటి ఇరుకైన బస్టాండులో బస్సులు నిలిపే చోట ఓ దుకాణ దారుడు ఓ బస్సు నిలిపేంత స్థలం ఆక్రమించు కున్నాడు. దీంతో మంగళవారం(సంతరోజు), పండుగ రోజుల్లో మున్సిపల్ బస్టాండులో స్థలం లేక బస్సులను రోడ్డుపైనే నిలిపి ఉంచు తున్నారు. దీంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. ఇకనైనా సంబంధిత అధికారులు పట్టించుకుని మున్సిపల్ బస్టాండులోనే ప్రైవేటు, ఆర్టీసీ బస్సులు నిలిపి, ప్రయాణికులకు ఎక్కించు కునేలా చర్యలు తీసుకోవాల్సి వుంది.