గ్యారంటీ లేని జీపీఎస్‌ వద్దే.. వద్దు

ABN , First Publish Date - 2023-09-25T23:01:29+05:30 IST

సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుదరిం చాల్సి ఉండగా, అందుకు భిన్నంగా జీపీఎస్‌ అమలుకు మంత్రి మండలి తీర్మానం చేయడా న్ని నిరసిస్తూ సోమవారం సాయంత్రం అన్న మయ్య జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేశా రు.

గ్యారంటీ లేని జీపీఎస్‌ వద్దే.. వద్దు
కలెక్టరేట్‌ ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు

రాయచోటి(కలెక్టరేట్‌), సెప్టెంబరు 25: సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుదరిం చాల్సి ఉండగా, అందుకు భిన్నంగా జీపీఎస్‌ అమలుకు మంత్రి మండలి తీర్మానం చేయడా న్ని నిరసిస్తూ సోమవారం సాయంత్రం అన్న మయ్య జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేశా రు. ఈ సందర్భంగా ఫ్యాప్టో జిల్లా సెక్రటరీ జనరల్‌ రవిశంకర్‌ మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఓపీఎస్‌ ముగిసిన అధ్యయమని ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండించారు. పాత పెన్షన్‌ విధానంపై మంత్రి నిర్లక్ష్యంగా మాట్లాడటం ఉద్యోగ, ఉపాధ్యాయులపై ఈ ప్రభుత్వానికున్న వైఖరిని తేటతెల్లం చేస్తున్నదన్నారు. మాట తప్పను, మడమ తిప్పను, విశ్వసనీయత కోల్పోతే పదవిలో కొనసాగను అని పదే పదే వల్లె వేసిన ముఖ్యమంత్రి ఈ రోజు చేస్తున్నదేమిటని ప్రశ్నించారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆకాంక్షలకు భిన్నంగా ఉన్న జీపీఎస్‌ను అంగీకరించే ప్రశ్నే లేదన్నారు. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉద్యమాలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం జీపీఎస్‌ విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పురుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రూటా జిల్లా అధ్యక్షుడు సబాతుర్‌ రెహమాన్‌, ఎస్‌టీయూ రాష్ట్ర నాయకుడు రవీంద్రరెడ్డి, ఎన్‌ఏ అసోషియేషన్‌ జిల్లా అధ్యక్షుడు గోపాల్‌ఖాన్‌, ప్రధానో పాధ్యాయుల సంఘం జిల్లా నాయకులు శివయ్య, జయన్న, దుర్గేశ్వరరాజు, మున్వర్‌, వెంకట్రామిరెడ్డి, నాగరాజు, వాసుదేవరెడ్డి, శివశంకర్‌, ఏపీయూఎస్‌పీఎస్‌ రాష్ట్ర కన్వీనర్‌ చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-09-25T23:01:29+05:30 IST