నేత్రపర్వం రాములోరి కల్యాణోత్సవం

ABN , First Publish Date - 2023-03-30T22:53:23+05:30 IST

సుగంధ, పరిమళాలు వెదఝల్లే పుష్పాలు, మిరుమిట్లు గొలిపే విద్యుత్‌ దీపాల అలంకరణలో ఎంపీడీఓ కార్యా లయ ఆవరణను సుందరంగా రూపొం దించిన వేదికపై చిద్విలాసం చిందిస్తూ సిగ్గుల మొగ్గై అరవిరిసిన కన్నులతో చూస్తుండగా శ్రీ రాముల వారు అమ్మవారి మెడలో మాంగల్య ధారణ చేశారు. ‘చూచిన వారిదే భాగ్యము... గాంచిన వారిదే సౌభాగ్యము’ అన్న చందంగా శ్రీరాముల వారి కల్యాణం సాగింది. వివరాల్లోకెళితే....

నేత్రపర్వం రాములోరి కల్యాణోత్సవం
అశేష భక్తుల నడుమ పీలేరు ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో కల్యాణ సీతారాముల కల్యాణోత్సవం

ఘనంగా నవమి వేడుకలు

జైశ్రీరామ్‌ నినాదాలతో మార్మోగిన ఊరూవాడా

వేడుకగా ఊరేగింపులు - భక్తులకు అన్నదానాలు

పీలేరు, మార్చి 30: సుగంధ, పరిమళాలు వెదఝల్లే పుష్పాలు, మిరుమిట్లు గొలిపే విద్యుత్‌ దీపాల అలంకరణలో ఎంపీడీఓ కార్యా లయ ఆవరణను సుందరంగా రూపొం దించిన వేదికపై చిద్విలాసం చిందిస్తూ సిగ్గుల మొగ్గై అరవిరిసిన కన్నులతో చూస్తుండగా శ్రీ రాముల వారు అమ్మవారి మెడలో మాంగల్య ధారణ చేశారు. ‘చూచిన వారిదే భాగ్యము... గాంచిన వారిదే సౌభాగ్యము’ అన్న చందంగా శ్రీరాముల వారి కల్యాణం సాగింది. వివరాల్లోకెళితే....

జిల్లా వ్యాప్తంగా రామాలయాల్లో చలవ పందిళ్లు వేసి శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా సాగాయి. సీతారాముల కల్యాణోత్సవాలు వేడుకగా జరిగిన ఆలయా ల వద్ద పెసర పప్పు, బెల్లం పానకం అందుబాటులో వుం చారు. మధ్యాహ్నం భక్తులకు అన్న ప్రసాదం అందించారు. సాయంత్రం సీతారాముల వారిని గ్రామాల్లో ఊరేగించి భక్తులకు దర్శనభాగ్యం కలిగించారు. పీలేరు కోదండ రామస్వామి ఆలయం, సదుం రోడ్డులోని కల్యాణ సీతారా మస్వామి దేవస్థానంలో ఏటా శ్రీరామ నవమి నాడు స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం నిర్వహించడం ఆనవా యితీ. స్థానిక ప్రకాశం రోడ్డులో కోదండరాముల వారికి కల్యాణ వేదిక ఏర్పాటు చేయగా, కల్యాణ సీతారాముల కల్యాణానికి ఎంపీడీఓ కార్యాలయం మండపంగా మారిం ది.

వేదికపైకి చిద్విలాసం చిందిస్తూ శ్రీరాముడు, సిగ్గుల మొగ్గలా సీతమ్మ వారు వధూవరులై చేరారు. వేదమంత్రో చ్ఛారణలు, పెళ్లిమంత్రాలు, మంగళవాయిద్యాల మేళతాళా లు, భక్తుల జైశ్రీరామ్‌ నినాదాల నడుమ వేదపండితులు మాంగళ్యధారణ గావించారు. దంపతులుగా స్వామి, అమ్మ వార్లు చిరునవ్వులు చిందిస్తూ భక్తులను అనుగ్రహించారు. కల్యాణోత్సవానికి హాజరైన జంటలకు అర్చకులు స్వామి, అమ్మ వారి తలంబ్రాలు, కంకణాలు కానుకగా అందించా రు. కన్నుల పండువగా జరిగిన కల్యాణ క్రతువును గాం చేందుకు పెద్దఎత్తున భక్తులు తరలి వచ్చారు.

మండలంలోని శ్రీరాముల వారి ఆలయాల్లో ప్రత్యేక పూజ లు, అభిషేకాలు నిర్వహించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులు ‘శోభాయాత్ర’ పేరిట స్కూటర్‌ ర్యాలీ చేపట్టారు. కార్యక్ర మాల్లో ఆలయ కమిటీ అధ్యక్షుడు కె.రామకృష్ణారెడ్డి, నంద్యా ల మణి, అర్చకులు ఆనంద స్వామి, తిరుమలాచార్యులు, ఈఓ సత్యం రెడ్డి, శశి, మల్లికార్జున గుప్తా, మహేశ్‌ గుప్తా, రాజగోపాల్‌, పెద్దబాబు, చిరంజీవి, పాల్గొన్నారు.

వైభవంగా సీతారాములవారి కల్యాణం

మదనపల్లె అర్బన్‌, మార్చి30: పట్టణంలో పలు ఆలయాల్లో శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా వైభవంగా సీతారాముల వారి కళ్యాణోత్సవం నిర్వహించారు. అయోధ్యనగర్‌ రామాలయంలో ఆలయధర్మక్తలు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కురుబ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ దండు రామాంజులుతో కలిసి శ్రీరామకల్యాణం ఘనంగా నిర్వహించారు. వాల్మీకివీధి సమీప రాగిమానువద్ద వాల్మీకి బృందం కల్యాణం నిర్వహించింది. కార్యక్రమంలో పాకాలహరి, మనే రి రాధ, సాకే నరసింహులు, కట్టుబావి చలపతి, రమణ, సూరి, కార్తీక్‌, శివ, బాలాజీ, చలపతి, తదితరులు పాల్గొన్నారు.

అమ్మినేనివీధి కోదండరామాలయంలో ఆలయకమి టీ అధ్యక్షుడు జ్యోలిపాళెం భవానీప్రసాద్‌, గంగిరెడ్డి, రఘునాధరెడ్డి, జగన్‌మోహన్‌ విశేషపూజలు నిర్వహించారు. మధ్యాహ్నం ఆలయ ఆవరణలో సీతారాముల కల్యాణం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ్‌, మార్పురి సుధాకర్‌ నాయుడు, కౌన్సిలర్‌ గిరిజాసాయి పాల్గొన్నారు. వరాల ఆంజనేయస్వామి ఆలయం లో వైభవంగా నవమి మహోత్సవాలు జరిగాయి.

సొసైటీ కాలనీ కోదండరామాలయంలో రాములోరిని విశేషాలంకరణలో భక్తులకు దర్శనం కల్పించారు. పీఎన్‌టీ కాలనీ టవర్‌ వద్ద వాల్మీకి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పులిశ్రీనివాసులు, సజ్జల నరసింహ, అప్పారావు వీధిలో ఆర్యవైశ్యులు ప్రజలకు ప్రసాదం అందించారు. పుంగనూరు రోడ్డులోని అభయాంజనేయస్వామి ఆలయం వద్ద వాసవీక్లబ్‌ సభ్యులు పానకం, మజ్జిక, ప్రసాదాన్ని భక్తులకు పంచిపెట్టారు.

రామారావు కాలనీ, విజయనగర్‌ కాలనీలోని ఆలయాల్లో శ్రీరామనమిని పురస్కరించుకుని మాజీఎమ్మెల్యే దేశాయ్‌ తిప్పారెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. తట్టివారిపల్లె బైపా్‌సలోని అభయాంజనేయస్వామి వారిని మాజీఎమ్మెల్సీ నరేశ్‌కుమార్‌రెడ్డి దర్శించుకున్నారు. నీరుగట్టువారిపల్లెలోని అభయాంజనేయస్వామి ఆలయంలో భక్తులు వైభవంగా నవమి పూజలు నిర్వహించారు. టీడీపీ నేతలు నాగూర్‌వలి, రాజేశ్‌, చంద్ర తదితరులు భక్తులకు ప్రసాదాలు పంపి ణీ చేశారు. మేదరవీధిలో వీరాం జనేయుల స్వామి, సీటీఎంలోని అభయాంజనేయ స్వామి, నిమ్మనపల్లె రోడ్డులోని ఆంజనేయస్వామి ఆలయాల్లో శ్రీరామనవమి వేడుక లు ఘనంగా నిర్వహించారు.

వాడ వాడలా కల్యాణోత్సవాలు

కలికిరి, మార్చి 30: మండల గ్రామాల్లో నవమి సందడి నెలకొం ది. కె.రెడ్డివారిపల్లెలో రాములవారి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వ హించారు. సర్పంచు ప్రతాప్‌కు మార్‌ రెడ్డి, యల్లమ్మ ఆలయ నిర్వాహకుడు అశోక్‌కుమార్‌ రెడ్డి ఆధ్వర్యంలో కల్యాణం నిర్వహించారు. భక్తులు హాజరయ్యారు. మర్రికుంటపల్లె, రాజువారిపల్లె, బెస్తపల్లె, మేడికుర్తి, పల్లవోలు, గుండ్లూరు, మహల్‌, రంగనాథపురం గ్రామాల్లో నిర్వహించిన రాముల వారి కల్యాణోత్సవాలు భక్తులను కనువిందు చేశాయి.

నిమ్మనపల్లె మండలంలో....

నిమ్మనపల్లె, మార్చి 30: మండల రామాలయాల్లో నవమి ఉత్సవాలను గ్రామస్తులు ఘనంగా నిర్వహించి సీతారాము ల కల్యాణం చేశారు. నిమ్మనపల్లె, అగ్రహారం, బండమీదమాలపల్లె, వెంకోజిగారిపల్లె, మాదిగిపల్లెల్లో వున్న రామాలయాల్లో స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి మధ్యా హ్నం 12 గంటలకు కల్యాణోత్సవం నిర్వహించారు.

బి.కొత్తకోట మండలంలో....

బి.కొత్తకోట మార్చి 30: మండలంలో శ్రీరామనవమి పర్వదినం ప్రజలు భక్తి శ్రద్దలతో చేసుకున్నారు. స్థానిక పోకనాటివీధిలో వెలసిన కోదండరామాలయం, ఆర్యవైశ్య బజారు, హరిమందిరం వీధి, బడికాయలపల్లె సమీప పట్టాభిరామాలయాల్లో సీతారాముల కల్యాణోత్సవాలు నిర్వహించారు.

ఘనంగా ఊరేగింపులు

పెద్దతిప్పసముద్రం మార్చి 30: మండల గ్రామాల్లో నవమి వేడుకలు ఘనంగా చేశారు. రంగసముద్రం, విసనకర్రవాండ్లపల్లె, రాపూరివాండ్లపల్లె, బొంతవారిపల్లె, పీటీఎం సహా మల్లెల, అంకిరెడ్డిపల్లె, తోకలవారిపల్లె, బూర్లపల్లె, టి.సదుం గ్రామాల్లో రాములోరికి గురువారం ఉదయం నుంచే భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించి అన్నదానాలు నిర్వహించా రు. ఆయా గ్రామాల్లో స్వామి వారి ఉత్సవ విగ్రహాలను మంగళవాయిద్యాల నడుమ చెక్కభజనలు, కోలాటలతో పుష్పపల్లకిలో స్వామి వారిని ఊరేగించారు.

గుర్రంకొండ మండలం మండలంలో....

గుర్రంకొండ, మార్చి 30: శ్రీరామ నవమి వేడుకలను ప్రజలు భక్తిశ్రద్ధలతో చేసుకున్నారు. గుర్రంకొండ, తరిగొం డ, అరిగెలవారిపల్లె, రామాపురం గ్రామాల్లోని రామాలయా ల్లో స్వామి వారికి ప్రత్యేక పూజలను చేసి కల్యాణోత్సవం నిర్వహించారు. ప్రజలు స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను అందజేశారు.

కలకడ మండలం మండలంలో....

కలకడ, మార్చి 30: మండల ప్రజలు శ్రీరామ నవమి పండుగను వేడుకగా చేసుకున్నారు. ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించారు. మర్రిమాను పల్లె, సింగనొడ్డుపల్లె, గువ్వలవారిపల్లె, గుడిబండ తెట్టు తదితర గ్రామాల ఆలయాల్లో సీతారాములు కల్యా ణోత్సవాన్ని చేశారు. ఆయా గ్రామాల్లో స్వామి వారిని ఊరేగించారు. మంగళవాయిద్యాలు, కోలాటాలు, చెక్కభజనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

వాల్మీకిపురం మండలంలో....

వాల్మీకిపురం, మార్చి 30: వాల్మీకిపురం మండల వ్యాప్తంగా నవమి వేడుకలను వైభవంగా చేసుకున్నారు. స్థానిక పట్టా భి రామాలయంలో టీటీడీ ఆధ్వర్యంలో సీతాలక్ష్మణ సమేత పట్టాభిరాములకు ప్రత్యేక పూజలు చేసి భక్తులకు తీర్థప్ర సాదాలు పంపిణీ చేశారు. చింతపర్తి పంచాయతీ కార్యాల యం వద్ద శ్రీరాముడి చిత్రపటానికి పూజలు చేసి వేడుక లు నిర్వహించి, ప్రజలకు వడపప్పు, పానకం పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో సర్పంచ్‌ మహిత, మండల నేతలు పులి సత్యారెడ్డి, కాంతరాజు, భాస్కర్‌రెడ్డి, కేవీ రెడ్డి, నరసిం హారెడ్డి, శేషాద్రిరెడ్డి, కువైట్‌ ఆదినారాయణ, గుడ్రెడ్డి చంద్రారెడ్డి, భాస్కర్‌, చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.

తంబళ్లపల్లె మండలంలో....

తంబళ్లపల్లె, మార్చి 30: మండలంలోని పలు ఆలయాలు గురువారం శ్రీరామనామంతో మార్మోగాయి. స్థానిక కోదండ రామస్వామి ఆలయంలో భక్తులు ఉదయం నుంచే పెద్ద ఎత్తున హాజరై స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశా రు. శేష సాయి బాబా ఆలయంలో టీటీడీ వేదపండితులు రాఘవేంద్రా చార్యులు, ఆలయ వేద పురోహితులు స్కందమూర్తి శర్మ సీతారాముల కల్యాణోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. సాయంత్రం తంబళ్లపల్లె పురవీధుల్లో సీతారామలక్ష్మణుల ఉత్సవమూర్తులను ఊరేగించారు.

ములకలచెరువు మండలంలో....

ములకలచెరువు, మార్చి 30: మండలంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోంపల్లె పంచాయతీ బిళ్లూరివారిపల్లెలోని విఘ్నసాయి రామాలయం, ములకల చెరువులోని అంజనేయస్వామి ఆలయం, గూడుపల్లెలోని రామాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించా రు. భక్తులు అఽధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.

రామసముద్రం మండలంలో....

రామసముద్రం, మార్చి 30: మండల వ్యాప్తంగా నవమి వేడుకలు వైభవంగా చేసుకున్నారు. మండలంలోని అన్ని రామాలయాలు, ఆంజనేయస్వామి ఆలయాలను విద్యుత్‌ దీపాలతో సుందరంగా అలంకరించారు. ఆర్‌.నడింపల్లె పంచాయతీ జంగాలపల్లెలోని ఆలయంలో సీతారామ కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు.

పెద్దమండ్యం మండలంలో....

పెద్దమండ్యం, మార్చి 30: మండలంలో నవమి వేడుకను వేడుకలను వైభవంగా చేసుకున్నారు. పెద్దమండ్యం, రెడ్డివారిపల్లి, ముసలికుంట, బండ్రేవు, మందలవారిపల్లి, గుడిసెవారిపల్లి, గురివిరెడ్డిగారిపల్లి, మిట్టామాలపల్లి, గుర్రంవాండ్లపల్లి, కలిచెర్ల, కోటగుట్టపల్లి, శివపురం రామాలయాల్లో సీతరాముల విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు గ్రామా ల్లో సీతారాముల ఉత్సవమూర్తులకు వైభవంగా కల్యాణోత్సవం నిర్వహించారు.

Updated Date - 2023-03-30T22:53:23+05:30 IST