నెల్లూరు, అనంతపురం జట్ల విజయం
ABN , First Publish Date - 2023-05-02T23:16:09+05:30 IST
ఏసీఏ అండర్-23 మెన్స వన డే ఇంటర్ డిసి్ట్రక్ట్ క్రికెట్ మ్యాచలో భాగంగా మంగళవారం కడపలో జరిగిన రెండు వేర్వేరు మ్యాచలలో చిత్తూరు జట్టుపై 73 పరుగుల తేడాతో నెల్లూరు జట్టు గెలువగా, మరో మ్యాచలో కర్నూలు జట్టుపై అనంతపురం జట్టు 133 పరుగుల భారీ స్కోర్ తేడాతో విజయభేరి మోగించింది.
కడప (స్పోర్ట్స్) మే 2: ఏసీఏ అండర్-23 మెన్స వన డే ఇంటర్ డిసి్ట్రక్ట్ క్రికెట్ మ్యాచలో భాగంగా మంగళవారం కడపలో జరిగిన రెండు వేర్వేరు మ్యాచలలో చిత్తూరు జట్టుపై 73 పరుగుల తేడాతో నెల్లూరు జట్టు గెలువగా, మరో మ్యాచలో కర్నూలు జట్టుపై అనంతపురం జట్టు 133 పరుగుల భారీ స్కోర్ తేడాతో విజయభేరి మోగించింది. వివరాలిలా.... నగర రిమ్స్ సమీప వైఎ్‌సరాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో నెల్లూరు- చిత్తూ రు జట్ల మధ్య మ్యాచలో టాస్ నెగ్గిన నెల్లూరు జట్టు బ్యాటింగ్ చేపట్టింది. నిర్ణీత 50 ఓవర్లలో 39.4 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 180 పరుగులకు ఆలౌట్ అయింది. ఇందులో సాకేతరామ్ (బ్యాటర్) 68 పరుగులు (57 బంతులు) చేశాడు. తదుపరి బ్యాటింగ్ చేపట్టిన చిత్తూరు జట్టు 31.2 ఓవర్లలో కేవలం 107 పరుగులకే ఆలౌట్ అయ్యి 73 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. నెల్లూరు జట్టు బౌలింగ్ విభాగంలో మాధవ్ 5 వికెట్లు సాధించి గెలుపులో కీలకపాత్ర వహించారు.
కేఎస్‌ఆర్‌ఎం మైదానంలో....: నగర కేఎస్‌ఆర్‌ఎం మైదానంలో అనంతపురం- కర్నూలు జట్ల మధ్య జరిగిన మరో మ్యాచలో టాస్ నెగ్గిన అనంతపురం జట్టు తొలుత బ్యాటింగ్ చేపట్టి 44.2 ఓవర్లలో 256 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇందులో దత్తారెడ్డి 104 పరుగులు (69 బంతుల్లో) సాధించడం విశేషం. తదుపరి బ్యాటింగ్ చేపట్టిన కర్నూలు జట్టు 42.2 ఓవర్లలో 123 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో అనంతపురం జట్టు 133 పరుగుల భారీ తేడాతో విజయకేతనం ఎగురవేసింది.