నయనానందకరం.. శ్రీవారి కల్యాణం
ABN , First Publish Date - 2023-08-02T23:47:38+05:30 IST
శ్రవణానక్షత్రం సందర్భంగా తిరుమల తొలి గడపగా ఖ్యాతిగాంచిన దేవునికడపలోని శ్రీలక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం శ్రీవారి కల్యాణం నయనానందకరంగా జరిగింది. శ్రీదేవిభూదేవి సమేత శ్రీలక్ష్మీవెంకటేశ్వరస్వామిని అలంకారంలో ఆలయ ప్రధాన అర్చకుడు మచ్చాశేషాచార్యులు, కృ ష్ణమోహనల సారథ్యంలో కల్యాణం రమణీయంగా సాగింది.
కడప (కల్చరల్), ఆగస్టు 2 : శ్రవణానక్షత్రం సందర్భంగా తిరుమల తొలి గడపగా ఖ్యాతిగాంచిన దేవునికడపలోని శ్రీలక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం శ్రీవారి కల్యాణం నయనానందకరంగా జరిగింది. శ్రీదేవిభూదేవి సమేత శ్రీలక్ష్మీవెంకటేశ్వరస్వామిని అలంకారంలో ఆలయ ప్రధాన అర్చకుడు మచ్చాశేషాచార్యులు, కృ ష్ణమోహనల సారథ్యంలో కల్యాణం రమణీయంగా సాగింది. భక్తులు శ్రీవారి క ల్యాణం తిలకి ంచి పరవశించారు. అనంతరం బి.శేషగిరిరావు ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఆలయ ఇనస్పెక్టరు ఈశ్వర్‌రెడ్డి, భక్తులు పాల్గొన్నారు.