ఉద్యాన కళాశాలలో నేటి నుంచి జాతీయ సదస్సు

ABN , First Publish Date - 2023-05-26T23:27:28+05:30 IST

సంప్రదాయ కూరగాయల సాగు, అవశ్యకత, శాస్త్రీయ పరిశోధన ప్రగతి వివరించే లక్ష్యంగా అనంతరాజుపేట ఉద్యాన కళాశాలలో శనివారం నుంచి జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు కళాశాల అసోషియేట్‌ డీన డాక్టర్‌ కె.గోపాల్‌ తెలిపారు.

ఉద్యాన కళాశాలలో నేటి నుంచి జాతీయ సదస్సు
అనంతరాజుపేట ఉద్యాన యూనివర్శిటీ ముఖద్వారం

సంప్రదాయ కూరగాయల అవశ్యకతపై రెండు రోజుల పాటు నిర్వహణ

దేశ వ్యాప్తంగా 240 మంది రిజిసే్ట్రషన

రైల్వేకోడూరు, మే 26: సంప్రదాయ కూరగాయల సాగు, అవశ్యకత, శాస్త్రీయ పరిశోధన ప్రగతి వివరించే లక్ష్యంగా అనంతరాజుపేట ఉద్యాన కళాశాలలో శనివారం నుంచి జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు కళాశాల అసోషియేట్‌ డీన డాక్టర్‌ కె.గోపాల్‌ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ హైబ్రీడ్‌ (ఆనలైన ఆఫ్‌ లైన కలిపి) విధానంలో నిర్వహించే ఈ సదస్సును యూనివర్శిటీ వీసీ డాక్టర్‌ టి.జానకిరాం ప్రారంభిస్తా రన్నారు. ఆచార్య ఎనజీ రంగా వ్యవ సాయ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్‌ ఎ.విష్ణువర్ధన రెడ్డి, వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్శటీ వీసీ డాక్టర్‌ వి.పద్మనాభరెడ్డిలు హజరు అవుతున్నారని తెలిపారు. ప్రారంభ కార్యక్రమాన్ని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన యూనివర్శిటీ డీన డాక్టర్‌ ఏఎస్‌ పద్మావతమ్మ అధ్యక్షతన నిర్వహిస్తారన్నారు. దేశీయ సంప్రదాయ కూరగాయయయయయయయల సాగు, పరిశోధనల ప్రగతి, శాస్త్రీయ పద్ధతుల్లో సాగు అవశ్యకత వివరించే లక్ష్యంతో నిర్వహించే ఈ సదస్సుకు దేశ వ్యాప్తంగా 240 మంది రిజిసే్ట్రషన చేయించుకున్నట్లు ఆయన వివ రించారు.

వీరిలో కొంత మంది నేరుగా, మరి కొందరు ఆనలైన ద్వారా హజరు అవుతున్నారన్నారు. సదస్సుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. కూరగాయల శాస్త్ర అధ్యాపకులు డాక్టర్‌ సయ్యద్‌ సదరున్నీసా, డాక్టర్‌ పి.శ్యాంసుందర్‌రెడ్డిలు ఆర్గనైజింగ్‌ సెక్రటరీలుగా వ్యవహరిస్తారన్నారు. సదస్సు విజయవంతం కోసం వివిధ కమిటీలు పని చేస్తాయన్నారు.

Updated Date - 2023-05-26T23:27:28+05:30 IST