సీకేదిన్నె తహసీల్దారుగా నారాయణరెడ్డి

ABN , First Publish Date - 2023-06-02T23:32:16+05:30 IST

చింతకొమ్మదిన్నె నూతన తహసీల్దారుగా ఎంవీఎస్‌ నారాయణరెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.

సీకేదిన్నె తహసీల్దారుగా నారాయణరెడ్డి

సీకేదిన్నె, జూన్‌ 2: చింతకొమ్మదిన్నె నూతన తహసీల్దారుగా ఎంవీఎస్‌ నారాయణరెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్‌ ఉత్తర్వుల మేరకు జిల్లాలో 18 మంది తహసీల్దార్లు బదిలీల్లో భాగంగా చింతకొమ్మదిన్నెకు నూతన తహసీల్దారుగా వల్లూరు మండలం నుంచి నారాయణరెడ్డి బదిలీపై చింతకొమ్మదిన్నెకు రాగా గతంలో తహసీల్దారుగా పనిచేస్తున్న వి.గంగయ్య పోరుమామిళ్లకు వెళ్లినట్లు తెలిసింది. ఈ సందర్భంగా నూతన తహసీల్దారు మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన అన్ని పనులు త్వరితగతిన పూర్తి చేసి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు.

Updated Date - 2023-06-02T23:32:16+05:30 IST