నల్లమలలో మార్మోగిన కాశినాయన నామం
ABN , Publish Date - Dec 26 , 2023 | 11:15 PM
నల్లమల అటవీ ప్రాంతం జ్యోతిక్షేత్రంలో అవదూత కాశినాయ న నామస్మరణ మార్మోగింది. వేకువ జామున రుద్రాభిషేకంతో కాశిరెడ్డి నాయన 28వ ఆరాధనోత్సవాలు ప్రారంభమయ్యాయి.
అట్టహాసంగా ప్రారంభమైన ఆరాధనోత్సవాలు
జీవ సమాధి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు
పోలీసుల భారీ బందోబస్తు
సువిశాలమైన చలువ పందిల్లు, స్వాగత తోరణాలు
విస్తృతంగా అన్నదానం కౌంటర్లు
కాశినాయన డిసెంబరు 26: నల్లమల అటవీ ప్రాంతం జ్యోతిక్షేత్రంలో అవదూత కాశినాయ న నామస్మరణ మార్మోగింది. వేకువ జామున రుద్రాభిషేకంతో కాశిరెడ్డి నాయన 28వ ఆరాధనోత్సవాలు ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు జ్యోతి క్షేత్రానికి తరలివచ్చారు. ఎత్తైన కొండల నడు మ ప్రశాంతమైన ఆహ్లాదకర కొండల్లో జ్యోతి క్షేత్రం భక్తులతో జనసంద్రమైంది. భక్తులు కాశినాయన సమాధి వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం లక్ష్మీ నరసింహస్వామి, అన్నపూర్ణేశ్వరి, దత్తాత్రేయ, ఆవు సమాధిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు పెద్దఎత్తున ఉచిత భోజనాలు అందించారు. వివరాల్లోకెళితే....
స్థానికులు సహా ఎర్రగుంట్ల, తాడిపత్రి, చాగలమర్రి, రేవనూరు తదితర గ్రామాల నుంచి వందల సంఖ్యలో కాశినాయన భక్తులు తరలి వచ్చి భోజనాలు సిద్ధం చేయడం, వండివడ్డించ డం, పరిసరాలను శుభ్రపరచడం లాంటి అనేక కార్యక్రమాల్లో విరివిగా సేవలను అందిస్తున్నారు. ఎర్రగుంట్ల కాశినాయన సేవాసంఘం వారు దశాబ్ధకాలంగా ఆరాధనలో అన్నదానానికి సొం త ఖర్చుతో మిరపకాయ బజ్జీలను వారే తయారుచేసి అందిస్తూ వస్తున్నారు. కాశినాయన ఆరాధనకు వచ్చిన భక్తులు తమతోపాటు అన్నదానానికి తోచినమేర ఆర్థిక సాయం, బియ్యం, బేడలు, కూరగాయలు, ప్లేట్లు నూనెలు ఇతర వస్తువులు కానుకగా అందిస్తున్నారు.
ఈ ఆరాధనలో అన్నదానానికి ఖర్చుచేసిన సరుకులకంటే భక్తులు అందజేసినవే ఎక్కువగా ఉన్న ట్లు సమాచారం. కాశినాయన మాలధారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాత్రి జ్యోతి ప్రజ్వలన, రధోత్సవం నిర్వహించారు. డాక్టర్ ప్రశాంతి ఆధ్వర్యంలో నర్సాపురం ప్రాధమిక ఆరోగ్య సిబ్బంది ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. పోరుమామిళ్ల సీఐ చిరంజీవి ఆధ్వర్యంలో ఎస్‌ఐ అమర్‌నాధ్‌రెడ్డ్డి పర్యవేక్షణలో దాదాపు 200 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల సంఖ్య ఎక్కువగా ఉండడంతో వాటి పార్కింగ్ కోసం పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.