‘నా భూమి నాదేశం’ను విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2023-08-05T23:20:08+05:30 IST

జాతీ య స్థాయిలో జరగబోయే నా భూమి నాదేశం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ గిరీషా అధికారులను ఆదేశించారు.

‘నా భూమి నాదేశం’ను విజయవంతం చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీషా

రాయచోటి(కలెక్టరేట్‌), ఆగస్టు5: జాతీ య స్థాయిలో జరగబోయే నా భూమి నాదేశం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ గిరీషా అధికారులను ఆదేశించారు. నా భూమి నా దేశం (మేరి మాటి మేర దేశ్‌), జగనన్న సురక్ష గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో, హసింగ్‌ ఈకేవైసీ తదితర అంశాలపై శనివారం సాయంత్రం కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహిం చిన సమీక్షలో కలెక్టర్‌ మాట్లాడుతూ నా భూమి నా దేశం కార్యక్రమం ఆగస్టు 9 నుంచి దేశవ్యాప్తంగా జరగబోతోందని, విజయవంతం చేసేందుకు సిద్దమవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇందులో ఆరు ఆంశాలు ఉంటాయ ని తెలియజేశారు. శిలాఫలకాలను ఏర్పాటు చేయడం, ప్రతిజ్ఞ చేయడం, మొక్కలు నాటడం, వీరులకు వందనం, జాతీయ జెండాను ఎగురవేయడం, మట్టిని సేకరించాలన్నారు. ఆగస్టు 9 కల్లా గ్రామ, మండల స్థాయిల్లో శిలాఫలకాలను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధుల సమక్షంలో వలంటీర్ల సేవలను వినియోగించుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు.

కార్యక్రమంలో పాల్గొనబోయే ప్రతి ఒక్కరూ శిలాఫలకం దగ్గర లేదా నాటిన మొక్కల దగ్గర సెల్ఫీ తీసుకు ని సంబంధిత వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాల న్నారు. శిలాఫలకం దగ్గర ప్రతిజ్ఞ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లా అటవీశాఖతో సమన్వయం చేసుకుని మూడో అంశమైన మొ క్కలు నాటాలన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతా ల్లో ఉన్న స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించడం నాల్గవ కార్యక్రమంగా ఉంటుందన్నారు. ఐదవ అంశంగా ఆగస్టు 15న జాతీయ జెండాను ఎగురవేయాలని, ఆరో కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 30 మండలాల్లో మట్టిని సేకరించాలని అధికారులను ఆదేశించారు.

రీసర్వే గురించి సమీక్షిస్తూ ఆర్డీఓలు, తహసీల్దార్‌లు ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. జగనన్న సురక్ష పథకంపై సమీక్షిస్తూ పథకాలకు సంబంధించిన సమస్యలను వెల్ఫేర్‌ అసిస్టెంట్లు త్వరగా పరిష్కరించాలని, వలంటీర్లు ప్రతి ఇంటికీ వెళ్లి సర్వే నిర్వహించాలని సూచించారు. గృహ నిర్మాణంపై సమీక్షిస్తూ విద్యుత్‌, నీటి సౌకర్యాల వ్యాలిడేషన్‌ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని, ప్రధాన మంత్రి అవాస్‌ యో జన పథకం కింద అవార్డులకు భువన్‌యా్‌పలో జియోట్యాగ్‌తో ఉన్న ఫొటోల ను అప్‌లోడ్‌ చేసేలా చర్యలు తీసుకోవాలని, పూర్తయిన ఇళ్లకు సంబంధించి వీడియో టెస్టిమోనియల్స్‌ తయారు చేయించాలని ఆదేశించారు. ఈ సమీక్షలో జా యింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, ఆర్డీఓలు, మున్సిపల్‌ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓ లు, మండల ప్రత్యేక అధికారులు, పంచాయతీ సెక్రటరీలు, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-05T23:20:08+05:30 IST