జగన్ పాలనను అంతమొందించాల్సింది ముస్లింలే..
ABN , Publish Date - Dec 17 , 2023 | 11:03 PM
అహంకారంతో వ్యవహరిస్తూ అన్ని రంగాలను సర్వ నాశనం చేసిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించాల్సిన బాధ్యత ముస్లిం నేతలపైనే ఉందని రాజం పేట టీడీపీ నేత గంటా నరహరి తెలిపారు.
రాజం పేట టీడీపీ నేత గంటా నరహరి
రాజంపేట, డిసెంబరు 17: అహంకారంతో వ్యవహరిస్తూ అన్ని రంగాలను సర్వ నాశనం చేసిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించాల్సిన బాధ్యత ముస్లిం నేతలపైనే ఉందని రాజం పేట టీడీపీ నేత గంటా నరహరి తెలిపారు. ఆదివారం రాజంపేటలో ముస్లిం మతపెద్దలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముస్లింల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్‌మోహన్ రెడ్డి వారిని అన్నివిధాలా అణగదొక్కారన్నారు. ముస్లింలు అన్ని రంగాల్లో నష్టపోయేందుకు కారణం జగన్‌మోహన్ రెడ్డేనన్నారు. పలు చోట్ల ముస్లిం మైనారిటీలు, బీసీలు, ఎస్టీలపై పైశాచిక దాడులు చేసి ఇబ్బందులపాలు చేశారన్నారు. ముస్లిం ఓట్లతో ప్రధాని, ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన అనేక పార్టీలు, నాయకులు ఆ తరువాత ముస్లింలకు చేసింది ఏమీ లేదన్నా రు. నారా చంద్రబాబు నాయుడు హయాంలో ముస్లింల సంక్షేమానికి 5వేలకోట్లు పైగా ఖర్చు చేశారని, ఈద్గాలు, షాదీ మహల్‌లు దర్గాల నిర్మాణంతో పాటు, రంజాన్‌తోఫా లాంటి అనేక కార్యక్రమాలు నిర్వహించార న్నారు. టీడీపీ హయాంలో ముస్లింలకు ఉన్న త పదవులు ఇచ్చిన విషయాన్ని గుర్తుంచుకో వాలన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఘనవిజ యం సాధించి నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావడం తఽథ్యమన్నారు. నియో జకవర్గ టీడీపీ నాయకులు పోలిసుబ్బారెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు గన్నె సుబ్బ నరసయ్య నాయుడు, మండలమాజీ ఉపాధ్యక్షుడు నాగా సుధా కర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ కో-ఆప్షన్ సభ్యుడు గులాంబాషా పాల్గొన్నారు.