అంధకారంలో ముద్దనూరు

ABN , First Publish Date - 2023-01-21T23:31:59+05:30 IST

ముద్దనూరు మండలంలోని అన్నీ గ్రామాల్లో అంధకారం ఏర్పడింది. 33కేవీ విద్యుత్‌ లైన్‌ సమస్యతో శనివారం మధ్యా హ్నం నుంచి విద్యుత్‌ లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు.

 అంధకారంలో ముద్దనూరు
అంధకారంలో ముద్దనూరు

ముద్దనూరు జనవరి21: ముద్దనూరు మండలంలోని అన్నీ గ్రామాల్లో అంధకారం ఏర్పడింది. 33కేవీ విద్యుత్‌ లైన్‌ సమస్యతో శనివారం మధ్యా హ్నం నుంచి విద్యుత్‌ లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు.రాత్రి కూడా కరెంటు రాని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎర్రగుంట్ల నుంచి ముద్దనూరు మండలానికి వచ్చే 33 కేవీ విద్యుత్‌ లైన్ల మధ్యలో సమస్య ఏర్పడటంతో కరెంటు రాని పరిస్థితి ఏర్పడింది. అయితే సమస్య ఎక్కడన్నది అధికారులు తేల్చలేదు. దీంతో రాత్రి కూడా మండలానికి కరెంటు నిలిచిపోయింది. 19గ్రామ పంచాయతీల్లోని 39 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాత్రి పూట ఎటువంటి సమస్య వస్తుందోనని ప్రజలు ఆందోళన చెందారు. అయితే ఇక్కడ పనిచేస్తున్న ట్రాన్స్‌కో ఏఈ రామక్రిష్ణను వైసీపీ నాయకులు వారి మాటలు వినడంలేదని, రాజకీయ కోణంలో ఆయనను బదిలీ చేయించినట్లు మండలంలో ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాదాపు 8నెలలుగా సబ్‌ఇంజనీరు ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు.రెగ్యులర్‌ ఏఈ లేక పోవడంతో ఇక్కడ పరిస్థితులు అస్తవ్యస్తంగా సాగుతున్నాయన్న విమర్శలూ వస్తున్నాయి.

Updated Date - 2023-01-21T23:32:16+05:30 IST