మొక్కుబడిగా మండల సర్వసభ్య సమావేశం

ABN , First Publish Date - 2023-06-02T23:13:22+05:30 IST

సిద్దవటం మండల సర్వ సభ్య సమావేశం శుక్రవారం మొక్కుబడిగా కొనసాగింది. ఈ సమావేశం వెలుగు కార్యాల యంలో జరిగింది. సమావేశంలో అధికారులు, ప్రతినిధులు కేవలం కొద్ది మంది మాత్ర మే హాజరు కావడంతో కార్యాలయం ఖాళీ కుర్చీల తో దర్శనమిచ్చింది.

మొక్కుబడిగా మండల సర్వసభ్య సమావేశం

పలు శాఖల అధికారులు గైర్హాజరు

సిద్దవటం, జూన్‌2 : సిద్దవటం మండల సర్వ సభ్య సమావేశం శుక్రవారం మొక్కుబడిగా కొనసాగింది. ఈ సమావేశం వెలుగు కార్యాల యంలో జరిగింది. సమావేశంలో అధికారులు, ప్రతినిధులు కేవలం కొద్ది మంది మాత్ర మే హాజరు కావడంతో కార్యాలయం ఖాళీ కుర్చీల తో దర్శనమిచ్చింది. మాదవరం గ్రామ పంచా యతీలో తాగునీటి సమస్య, గ్రీన్‌ అంబాసిడర్ల వేతన బకాయిలపై ఎంపీటీసీ సభ్యులు లక్ష్మీ రెడ్డి, శివయ్య పంచాయతీ కార్యదర్శి లక్ష్మీ నరసయ్యను ప్రశ్నించారు. నిధులున్నా జీతాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. బొగ్గుడివారిపల్లె ఎంపీటీసీ సభ్యుడు చంద్ర టశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ జగనన్న కాలనీలో రెండేళ్ల క్రితం బోరు, పైపు లైను పనులు చేశా మని, ఇంత వరకు బిల్లు మంజూరు కాలేదని సభ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం పలు శాఖల అధికారులు ప్రగతి నివేదిక చదివి విని పించారు. సమావేశానికి హాజరుకాని అధికారులపై చర్యలు తీసుకుంటానని ఎంపీ డీవో ఫణిరాజకుమారి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో శంకరయ్య, ఈవోపీ ఆర్‌డీ పులిరాంసింగ్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-02T23:13:22+05:30 IST