వెక్కిరిస్తున్న వాల్టా చట్టం...?!

ABN , First Publish Date - 2023-01-20T23:24:59+05:30 IST

మండలంలో వాల్టా చట్టం హాస్యాస్పదంగా మారింది. చట్టం గురించి ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో భారీ వృక్షాలు కలప మాటూనా భారీగా తరలిపోతుండడం శోచీయం.

వెక్కిరిస్తున్న వాల్టా చట్టం...?!
తలారివాండ్లపల్లె వద్ద వృక్షాలను నరికివేసి రవాణాకు సిద్ధం చేస్తున్న వ్యాపారులు

బట్టీల్లో బూడిదవుతున్న పచ్చదనం

కొరవడిన అటవీశాఖ అధికారులు పర్యవేక్షణ

గుర్రంకొండ, జనవరి 20: మండలంలో వాల్టా చట్టం హాస్యాస్పదంగా మారింది. చట్టం గురించి ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో భారీ వృక్షాలు కలప మాటూనా భారీగా తరలిపోతుండడం శోచీయం. కలప వ్యాపారులు ఇష్టానుసారంగా భారీ వృక్షాలను నరికేస్తూ బయట ప్రాం తాలకు తరలిస్తున్నారు. దీంతో విలువైన కలప షా మిల్లులు, ఇటుక బట్టీలకు చేరుతోంది. ప్రతి రోజు కలప వ్యాపారులు ఎటువంటి అను మతులు లేకుండా పదుల సంఖ్యలో కలపను అక్రమంగా తరలిస్తున్నా రు. అంతేకాకుండా అటవీ, ప్రభుత్వ భూముల్లో ఉన్న భారీ వృక్షాలను కూడా గుట్టుచప్పుడుకాకుండా నరికివేస్తూ విలువైన కలపను అక్రమం గా తరలిస్తూ సొమ్ము చేసుకొంటున్నారు. కలప వ్యాపారులకు ఆయా గ్రామాల వీఆర్వోలు, అటవీశాఖ అధికారుల అండదండలు ఉండడంతో వారి అక్రమ వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతు న్నట్లు మండల రైతులు, ప్రజలు విమర్శిస్తున్నారు. గుర్రంకొండ మండ లంలోని 15 పంచాయితీలో 175 గ్రామాలున్నాయి. ఈ క్రమంలో కొన్ని గ్రామాల్లో ప్రతి రోజు కలప వ్యాపారులు చెట్లను నరికేస్తూ షా మిల్లు లు, ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. పగటి పూట గ్రామాల్లో చెట్లను నరికి సాయంత్రం కాగానే ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. ఇందులో భాగంగా గ్రామాలోని వేప, మర్రి, కానుగ, మామిడి, చిగురు, చింత, నీలగిరి, రాగి, మద్ది, రోజ్‌ఉడ్‌, భాదం చెట్లను ఇష్టానుసారంగా రంపాలతో కోసేస్తు న్నారు. ఈ చెట్లను కోయడానికి రెవెన్యూ, అటవీశాఖ అధికారుల నుంచి ఎటువంటి అనుమతులు పొందకనే అక్రమంగా వృక్షాలను నరికేస్తు న్నారు. ముఖ్యంగా మండలంలోని టి.పసలవాండ్లపల్లె, ఎల్లుట్ల, నడిమి కండ్రిగ, సరిమడుగు, శెట్టివారిపల్లె, మర్రిపాడు. అమిలేపల్లె, చెర్లోపల్లె, తరిగొండ, టి.రాచపల్లె గ్రామాల్లో కలప అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతుంది. ఈ గ్రామాల్లో కలప వ్యాపారులు చెట్లను కోసేస్తున్న పట్టించుకొనే నాథుడు కరువయ్యారు. దీంతో వారి అక్రమ వ్యాపారానికి అడ్డూ అదుపులేకుండా పోతోంది.

చెట్లు కోయాలంటే..అనుమతి తప్పని సరి

మండల పరిధిలోనైనా ఎక్కడైనా సరే వృక్షాలను కోయాలన్నా.. తరలిం చాలన్నా అధికారుల అనుమతి తప్పని సరిగా తీసుకోవాలి. కలప వ్యాపారులు గ్రామాల్లో చెట్లను అక్రమంగా నరికేస్తునట్లు సంబంధిత వీఆర్వోల ద్వారా తెలిసింది. మండల పరిధిలో చెట్లు కోయడానికి అధికా రుల అనుమతి తప్పని సరిగా తీసుకోవాలి, అలాకాకుండా కలప వ్యాపా రులు ఇష్టానుసారంగా వృక్షాలను కోసి తరలిస్తే చర్యలు తీసుకొంటాం.

-ఖాజాబీ, తహశీల్దార్‌, గుర్రంకొండ, మండలం

Updated Date - 2023-01-20T23:25:02+05:30 IST