ముఖ్యమంత్రికి మంచి బుద్ధి ప్రసాదించు స్వామీ!

ABN , First Publish Date - 2023-09-19T23:17:03+05:30 IST

అధికారంలోకి వచ్చినప్పుటి నుంచి టీడీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న జగన్‌రెడ్డికి మంచి బుద్ధిని ప్రసాదించాలని రాష్ట్ర టీడీపీ కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా కోరారు.

ముఖ్యమంత్రికి మంచి బుద్ధి ప్రసాదించు స్వామీ!
రాజంపేట: కమ్మపాలెంలో వినాయకునికి వినతిపత్రం అందజేస్తున్న టీడీపీ నాయకులు

రాయచోటిటౌన్‌, సెప్టెంబరు 19: అధికారంలోకి వచ్చినప్పుటి నుంచి టీడీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న జగన్‌రెడ్డికి మంచి బుద్ధిని ప్రసాదించాలని రాష్ట్ర టీడీపీ కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా కోరారు. సోమవారం రాయచోటి టీడీపీ కార్యాలయంలో వినాయకుడి విగ్రహం ఏ ర్పాటు చేసి పూజలు నిర్వహించి అర్ధనగ్న ప్రదర్శన తో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గాజు ల ఖాదర్‌బాషా మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందన్నారు. వైసీపీ అధికారంలోకి వ చ్చినప్పటి నుంచి అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి తెలుగు దేశం పార్టీ అధి నేతతో పాటు ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తల పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడంతోపాటు, అక్రమ కేసులు బనాయిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ఎలాగె ౖనా గెలవాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి టీడీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు బనాయి స్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాడన్నారు. కార్య కర్తల్లో దైర్యం నింపే లక్ష్యంతో లోకేశ్‌ యువగళం పాదయాత్ర, చంద్రబాబు రోడ్‌షోలు ప్రారంభించ డంతో ప్రజల్లో తెలుగుదేశం పార్టీకి రోజు రోజుకు ఆదరణ పెరుగుతోందన్నారు. ప్రజల్లో టీడీపీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక అక్రమ కేసు బ నాయించి జైలు పాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్య క్షుడు బోనమల ఖాదర్‌వలి, పట్టణ మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు అతావుల్లా, పెమ్మాడపల్లె సర్పంచ్‌ పల ్లపు వాసు, మైనార్టీ నాయకులు రఫీ పాల్గొన్నారు.

రాజంపేట: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపైకేసులు కొట్టివేయాలని సిద్దవటం మండలం కమ్మపాలెం గ్రామంలో మంగళ వారం టీడీపీ మండల యువ నాయకుడు రాజనాయుడు నాగభూషణం నాయుడు, అయ్యప్పనాయుడు గణే శుడికి పూజలు చేసి, వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాటాడుతూ సైకో పాలన అంతమయ్యే రోజు దగ్గర పడిందని 2024ఎన్నికల్లో ప్రజలే ఓట్లతో బుద్ది చెబుతారన్నారు. అనంతరం ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవాలయం వరకు పాదయాత్ర చేసి సీతారాములకు పూజలు నిర్వ హించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు రామి రెడ్డి, హరి, పాలయ్య, శ్రీనివాసులు, మహేష్‌ నాయుడు పాల్గొన్నారు.

సుండుపల్లె: సీఎంకు మంచి బుద్ది ప్రసాదించాలని టీడీపీ నాయకులు సోమవారం వినాయకుడికి విన తిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాజం పే ట పార్లమెంట్‌ వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి దామోధర్‌నాయుడు మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలన నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగించాల ని ప్రార్థించినట్లు తెలిపారు. టీడీపీ మండల ఉపాధ్యక్షుడు యర్రంరెడ్డి, జనసేన నాయకులు రామశ్రీనివాసులు, మాజీ సర్పంచ్‌ రామునాయక్‌, జనార్థననాయుడు, రాజు తదితరులు పాల్గొన్నారు.

రాయచోటిటౌన్‌: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే రమేశ్‌ కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో రాయచోటి పట్ట ణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చేపట్టి న రిలే నిరాహార దీక్షలు మంగళవారం నాటికి 6వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రాజంపేట పార్లమెంట్‌ మహిళా విభాగం నేతలు సుజాత, న సీబ్‌జాన్‌, లక్ష్మిదేవి, చంద్రకళ ఆధ్వర్యంలో రాయ చోటి పట్టణంతో పాటు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుండి వచ్చిన మహిళలు దీక్షలో కూ ర్చున్నారు. జనసేన పార్టీ నేతలు ముకరం చాంద్‌, రామశ్రీనివాసులు, హషన్‌బాషా, ఇలియాస్‌ తది తర నేతలు, కార్యకర్తలతో పాటు రాజంపేట పార ్లమెంట్‌ టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి కూనాసి సుబ్బరాజుయాదవ్‌, పట్టణ అధ్యక్షులు బోనమల ఖాదర్‌వలి, గాలివీడు క్లస్టర్‌ ఇన్‌చార్జి సత్యారెడ్డి, రాజంపేట పార్లమెంట్‌ ప్రచార కార్యదర్శి మహ బూబ్‌అలీఖాన్‌, మన్సూర్‌, జావిద్‌ తదితరులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రమేశ్‌ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా చంద్ర బాబు కోసమ మేము సైతం అంటూ మహిళా లోకం రోడ్లపైకి వస్తోందన్నారు. మహిళల అభివృద్ధి కోసం ఇటీవల రోడ్‌షోలలో చంద్రబాబు ప్రకటిం చిన మహిళా శక్తి పథకం మహిళలను మరింత ముందుకు తీసుకెళుతుందన్నారు. చిన్న, పెద్ద, మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తు న్నారని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుండి చంద్రబాబుకు మద్దతు రోజు రోజుకు పెరుగుతోందన్నారు. ఇప్పటి కైనా ముఖ్యమంత్రి జగన్‌ కళ్లు తెరిచి కక్షసాధింపు దోరణితో అక్రమంగా జైల్లో పెట్టిన చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రాయచోటి పట్టణంతో పాటు చుట్టుప్రక్కల మండలాలకు చెందిన మహి ళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రైల్వేకోడూరు: జగన్‌ పాదయాత్రకు చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్య పద్ధతిలో సహకరించారని రైల్వేకోడూరు టీడీపీ ఇన్‌ఛార్జ్‌ కస్తూరి విశ్వనాథ నాయుడు తెలిపారు. మంగళవారం రైల్వేకోడూరు లో చేస్తున్న రిలే దీక్షలు 7వ రోజుకు చేరుకున్నా యి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్ర బాబు అరెస్టును ఇతర దేశాల్లో కూడా ఇది అన్యా యం అని ముక్తకంఠంతో చెబుతున్నా వైసీపీ మొండి వైఖరి అవలంబిస్తోందన్నారు. చంద్రబాబు హాయాంలో చాలా మందికి ఉద్యోగాలు వచ్చి దేశ, విదేశాల్లో స్థిరపడ్డారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని అడ్డం పెట్టుకుని లక్ష కోట్లు సంపా దించారన్నారు. సీబీఐ నేరాలను క్షుణ్ణంగా పరిశీలిం చిందన్నారు. 11 ఈడీ కేసులు ఉన్నాయన్నారు. ఇందులో 43 వేల కోట్ల ఆస్తులు అటాచ్‌లో ఉన్నా యన్నారు. చంద్రబాబుపై పెట్టిన కేసులో సత్తా లేదన్నారు. కావాలనే పెట్టారన్నారు. ఇది అంతా ప్రజలకు తెలునని తెలిపారు. రైల్వేకోడూరు నియో జకవర్గంలోని మంగంపేటలో దొంగరాయిని జగన్‌ తాత రాజారెడ్డి అమ్ముకుని బతికినారని గుర్తు చేశారు. ఒక్కసారి వెనకకు చూసుకుని వైసీపీ నేతలు మాట్లాడాలన్నారు. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్నారు. రాష్ట్రంలో జగన్‌పై 90 శాతం వ్యతిరేకత వచ్చిందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త మాచినేని విశ్వేశ్వరనాయుడు మాట్లాడుతూ చంద్ర బాబు అధికారంలోకి రావడం ఖాయమన్నారు. జరుగుతున్న పరిణామాలన్నీ ప్రజలు గమనిస్తు న్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెరుగు కృష్ణయ్యనాయుడు, కట్టా గుండయ్య నాయుడు, కమతం నాగరాజు యాదవ్‌, కేకే చౌదరి, నాగయ్య, కొండా వెంకటేష్‌, దళిత నాయకు లు పీ. రమేష్‌, చిన్నా, దుద్యాల అనితదీప్తి తదితరులు పాల్గొన్నారు.

గాలివీడు: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్టు అన్యాయమని మండల తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు అన్నారు. రాయచోటిల ఏర్పాటు చేసిన నిరసన శిబిరంలో మంగళవారం వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రభుత్వానికి పోయేకాలం దగ్గరకు వచ్చిందన్నారు. వైసీపీ నాయకులు ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, అన్యాయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో నూలివీడు మాజీ ఎంపీటీసీ పార్వతమ్మ, పూలుకుంట మాజీ ఎంపీటీసీ అంజనమ్మ, టీడీపీ మహిళలు సులోచనమ్మ, కల్యాణి, మమత, సుజాతమ్మ తదితరులు పాల్గొన్నారు.

వీరబల్లి: చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఐటీ ఉద్యోగులు పాదయాత్ర చేశారు. మంగళ వారం మట్లి వడ్డెపల్లెలో ముందుగా వినాయక విగ్రహం వద్ద ఐటీ ఉద్యోగులు, టీడీపీ శ్రేణులతో కలిసి పూజలు చేశారు. ఈ పాదయాత్రను టీడీపీ రాజంపేట సీనియర్‌ నేత, ప్రముఖ విద్యావేత్త చమర్తి జగన్‌మోహన్‌రాజు ప్రారంభించారు. మట్లి వడ్డె నుంచి యల్లంపల్లె, తొగటపల్లె మీదుగా మాం డవ్యనది ఒడ్డునున్న కోదండ రామాలయం వరకు పెద్ద ఎత్తున పాదయాత్ర సాగింది. అడుగడుగునా మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. బాబుతో మేము సైతం అంటూ ప్లకార్డులు పటు ్టకొని చంద్రబాబును వెంటనే విడుదల చేయాలం టూ డిమాండ్‌ చేశారు. రామాలయంలో 101 టెం కాయలు కొట్టి అర్చనలు చేయించారు. చంద్ర బాబును బేషరతుగా విడుదల చేయాలి. జగన్‌ అనే దొంగ.. అందరినీ దొంగలుగా చూపించాలని ప్రయత్నం చేస్తున్నాడు. జగన్‌ ప్రభుత్వానికి సమా ఽధి కట్టేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు భాను గోపాల్‌రాజు, మట్లి గ్రామ సర్పంచ్‌ నాగా ర్జునాచారి, టీడీపీ నాయకులు భూషణయ్య నాయుడు, నాయకులు, కార్యకర్తలు, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.

రాజంపేట: టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్ర బాబునాయుడు విడుదల కావాలని రాజంపేట టీడీపీ నేతలు చేస్తున్న దీక్షలు మంగళవారంతో ఏడవ రోజుకు చేరుకన్నాయి. రాజంపేట పార్లమెం ట్‌ అధికార ప్రతినిధి ప్రతాప్‌రాజు, మండల పార్టీ అధ్యక్షుడు గన్నె సుబ్బనరసయ్యనాయుడు, బీసీ నాయకులు ఇడిమడకలకుమార్‌, రాజంపేట పార ్లమెంట్‌ మహిళాధ్యక్షురాలు అనసూయమ్మ, మైనారి టీ మహిళా నాయకురాలు సాహేరా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తన రాజకీయ పైశాచిక ఆనందం కోసమే చంద్రబాబునాయుడుపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. రాబోవు ఎన్నికల్లో జగన్‌కు తగిన గుణపాఠం చెప్పి చిత్తుచిత్తుగా ఓడిస్తారన్నారు.

Updated Date - 2023-09-19T23:17:32+05:30 IST