జూనలో వికసించిన మే పుష్పాలు

ABN , First Publish Date - 2023-06-11T23:53:31+05:30 IST

ప్రతి ఏటా మే నెలలో ప్రకృతి ప్రేమికు లను అలరించే మే పుష్పం ఆలస్యంగా వికసించి కనువిందు చేస్తున్నాయి.

జూనలో వికసించిన మే పుష్పాలు
వికసించిన మే పుష్పాలు

తంబళ్లపల్లె, జూన 11: ప్రతి ఏటా మే నెలలో ప్రకృతి ప్రేమికు లను అలరించే మే పుష్పం ఆలస్యంగా వికసించి కనువిందు చేస్తున్నాయి. తంబళ్లపల్లె మండల కేంద్రం వెంకటేశ్వరవీధికి చెందిన లక్ష్మీనరసమ్మ ఇంటి పెరట్లో ఒకే సారి ఏడు మే పుష్పా లు వికసించి చూపరులను ఆకర్షిస్తున్నాయి. ఏడాదిలో మే నెల లో మాత్రమే వికసించే ఈ మే పుష్పాల కోసం అనేక మంది పకృతి ప్రేమికులు ఎదురుచూస్తుంటారు. ఈ ఏడాది ఆలస్యం గా జూన రెండో వారంలో వికసించడంతో ఆసక్తిగా తిలకిస్తు న్నారు. సుమారు నాలుగేళ్ల క్రితం కురబలకోటలోని ఓ నర్సరీ లో లక్ష్మీనరసమ్మ ఈ మొక్కల దుంపలను తెచ్చి నాటారు. దుంప నాటిన రెండో ఏడాది మే లో ఒక పువ్వు మాత్రమే పూయగా, మూడో ఏడాది మేలో రెండు పూలు పూసాయి. అయితే, ఈ ఏడాది ఆలస్యంగా జూనలో ఏడు పూలు వికసించి అందరినీ అబ్బురపరుస్తున్నాయి. పుట్‌బాల్‌ లిల్లీ లేదా బ్లడ్‌ లిల్లీ అనే అరుదైన జాతికి చెందిన ఈ పువ్వును భారతదేశంలో మే పుష్పం అని పిలుస్తారు. ఎండలు ఎక్కువగా ఉన్న మాసాల్లో ఏప్రిల్‌, మే నెలలో వికసిస్తుండటంతో మే పుష్పంగా పేరొచ్చిం ది. దుంప రకానికి చెందిన ఈ మొక్క భూమిలో విస్తరిస్తూ ఒక్కో దుంపకు ఏడాదికి ఒక పువ్వు మాత్రమే పూస్తుంది. ఇసుక నేలల్లో బాగా పెరిగే ఈ మే పుష్పం రోజులో సుమారు నాలుగు గంటల పాటు వికసించి ఉంటుంది. భూమిలో ఉన్న దుంప పరిమాణం బట్టి పువ్వు పరిమాణం ఉంటుంది.

Updated Date - 2023-06-11T23:53:31+05:30 IST