మాటిచ్చి.. మడమ తిప్పిన జగన్: పుట్టా
ABN , Publish Date - Dec 18 , 2023 | 11:09 PM
అక్క ల్లారా చెల్లెల్లారా ఒక్క సారి అవకాశమివ్వండంటూ వేతనాలు పెంచుతామని చెప్పిన జగన్‌మోహన్‌రెడ్డి మాట తప్పి మడమ తిప్పాడని టీడీపీ నియోజక వర్గ ఇన్‌చార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ ఆరోపిం చారు.
దువ్వూరు (మైదుకూరు), డిసెంబరు 18 : అక్క ల్లారా చెల్లెల్లారా ఒక్క సారి అవకాశమివ్వండంటూ వేతనాలు పెంచుతామని చెప్పిన జగన్‌మోహన్‌రెడ్డి మాట తప్పి మడమ తిప్పాడని టీడీపీ నియోజక వర్గ ఇన్‌చార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ ఆరోపిం చారు. స్థానిక తహసీల్దారు కార్యాలయం వద్గ అంగన్‌వాడీ కార్యకర్తలు చేస్తున్న దీక్షలకు సోమ వారం ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ మొండి వైఖరితో ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నాడన్నారు. అంగన్‌వాడీల పోరాటానికి మద్దతుగా నిలుస్తామని తెలిపారు. బోరెడ్డి వెంకటరమణారెడ్డి, పాపినేని రాంబాబు, సాహిరుద్ధిన్, నారపురెడ్డి సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మైదుకూరులో దీక్షా శిబి రం నుంచి రాయల్ సర్కిల్ వరకు ర్యాలీ చేసి మానవహారం నిర్మించారు. జేఏసీ నాయకులు ధనలక్ష్మి, గంగావతి కమ్యూనిస్ట్ నాయకులు శివ కుమార్, రాములు, మంజుల గంగాభవాని, జహం గీర్ బాషా తదితరులు పాల్గొన్నారు.
కొండాపురం: అంగన్వాడీ కార్యకర్తలు,ఆయాలు చేస్తున్న ఆందోళనకు మండల కేంద్రంలో సోమవారం మహిళలు తమ పిల్లలతోపాటు, ఏఐటీయూసీ, సీపీఐ నాయకులు మద్దతు పలికారు. ప్రధాన కూడలిలో మానవహారం ఏర్పాటు చేశారు. సీపీఐ మండల కార్యదర్శి మనోహర్‌బాబు, ఏఐటీయూసీ నాయకులు వెంకటరమణ, తారాదేవి, సుబ్బారావు, ఎన్టీఎఫ్ జిల్లా మహిళాధ్యక్షురాలు జ్యోతి, పద్మ, శివపార్వతి, రాము, తులసి తదితరులు పాల్గొన్నారు.
ముద్దనూరు:సీఎం జగన్మోహన్‌రెడ్డి అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు దీక్షలు కొనసాగిస్తామని అంగన్వాడీ యూనియన్ నాయకురాలు కళావతి తెలిపారు. దీక్షల్లో భాగంగా తహసీల్ధారు కార్యాలయం నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు.
పోరుమామిళ్ల: అంగన్వాడీల డిమాండ్లపై చర్చిం చాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు భైరవ ప్ర సాద్ కోరారు. సోమవారం అంగన్వాడీలు అంబే ద్కర్ విగ్రహం ఎదుట ఆందోళన చేశారు. ప్రాజెక్టు కార్యదర్శి మేరీ, దస్తగిరమ్మ సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు ఓబులా పురం విజయమ్మ, రేణుక, జ్యోతమ్మ, రమాదేవి, శ్రీదేవి, లక్ష్మిదేవి, పాల్గొన్నారు.
జమ్మలమడుగు: జమ్మలమడుగులో అంగన్వాడీలు, ఆయాలు భిక్షాటన చేశారు. ఐసీడీఎస్ కార్యాలయం ఎదురుగా ఉదయం నిరసన తెలిపి ప్రభుత్వ కార్యాలయాల్లో, రోడ్డుపై భిక్షమెత్తారు. సంజామల మోటు నుంచి పాత బస్టాండు మీదుగా ర్యాలీ నిర్వహించి, ఆర్డీవో కార్యాలయం ఎదురుగా ధర్నా చేశారు. ఆర్డీవో శ్రీనివాసులుకు వినతి పత్రం అందించారు. సీఐటీయూ కార్యదర్శి దాసరి విజయ్, ఏఐటీయూసీ పట్టణ ఉపాధ్యక్షుడు ప్రసాద్, అంగన్వాడీ యూనియన్ నాయకులు లక్ష్మిదేవి, కుళ్లాయమ్మ, నాగలక్ష్మి, ఓబులేసు, రామలక్ష్మి, ఇందిర, సుగుణ, రమణమ్మ, బాలసిద్దమ్మ, ప్రసన్న, మూడు మండలాలకు చెందిన అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.
బద్వేలు రూరల్: ప్రతిపక్ష నాయకుడిగా అంగన్వాడీ లకు ఇచ్చిన హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత నట్టేట ముంచాడని మాజీ ఎమ్మెల్యే కె. విజయమ్మ అన్నారు. స్థానిక సీడీపీవో కార్యాలయం ముందు అంగన్వాడీల దీక్షకు ఆమె సంఘీభావం తెలిపారు. అనంతరం మాట్లాడుతూ అంగన్వాడీ డిమాండ్లను టీడీపీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దృష్టికి తీసుకెళ తానని హామీ ఇచ్చారు. అంగన్వాడీల సమ్మెలో భా గంగా ముందుగా సిద్దవటం రోడ్డులోని ఎన్జీవో కాలనీ వద్ద మానవహారం ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. అనంతరం సీడీపీవో కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు చిన్ని, గోపవరం మండల వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు కదిరయ్య, టీడీపీ నాయకులు రవికుమార్‌రెడి ్డ, రామ్మోహన్‌రెడ్డి, జహంగీర్‌బాషా, రామసుబ్బారెడి ్డ, చంద్రశేఖరరెడ్డి పాల్గొన్నారు.
ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరులో తహసీల్దారు కార్యా లయం నుంచి శివాలయం వరకు ర్యాలీ నిర్వహిం చారు. ఏఐటీయూసీ, ిసీఐటీయూ నేతలు సుబ్బ రాయుడు సత్యనారాయణ, విజయ్‌కుమార్, అంగన్ వాడీ వర్కర్స్ యూనియన్ నేతలు మంజుల. సుబ్బ లక్ష్మి, నాగలక్ష్మి, రాజీ, నిర్మల, పద్మ, సుబ్బలక్షుమ్మ, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి సాల్మన్, డీవైఎఫ్‌వై కార్యదర్శి డేవిడ్ పాల్గొన్నారు. ఈ సమ్మె కు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ప్రవీణ్‌రెడ్డి సతీ మణి మౌనికారెడ్డి సోదరి హరితా రెడ్డి మద్దతు పలికారు.
చాపాడు: చాపాడులో అంగన్వాడీ టీచర్లు నల్లరిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. తహసీల్దారు యామినికి వారు వినతి పత్రం అందజేశారు.
బ్రహ్మంగారిమఠం: స్థానిక తహసీల్దారు కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు చెవిలో పూలు పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.వేతనాలు పెం చేంత వరకు తమ దీక్షలు కొనసాగిస్తామని తెలి పారు.
====================================