లోన్‌యాప్‌ మోసగాడు అరెస్టు

ABN , First Publish Date - 2023-05-25T23:14:14+05:30 IST

ఒంటిమిట్ట మండలం కొత్తమాధవరం గ్రామానికి చెందిన కల్పన అనే యువతిని లోన్‌యాప్‌ ద్వారా మోసం చేసిన మోసగాడితో పాటు మరో ఐదుగురు మహిళలను అరెస్టు చేసినట్లు ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ తెలిపారు.

లోన్‌యాప్‌ మోసగాడు అరెస్టు
నిందితుడి వివరాలువెల్లడిస్తున్న ఎస్పీ అన్బురాజన్‌

కడప (క్రైం), మే 25: ఒంటిమిట్ట మండలం కొత్తమాధవరం గ్రామానికి చెందిన కల్పన అనే యువతిని లోన్‌యాప్‌ ద్వారా మోసం చేసిన మోసగాడితో పాటు మరో ఐదుగురు మహిళలను అరెస్టు చేసినట్లు ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని పెన్నార్‌ కాన్ఫరెన్స్‌ హాలులో గురువారం అదనపు ఎస్పీ తుషార్‌డూడి, కడప డీఎస్పీ షరీ్‌ఫతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి నిందితుల వివరాలు వెల్లడించారు. వెస్ట్‌బెంగాల్‌కు చెందిన బుద్ద శివమందిర్‌ బర్దామన్‌కు చెందిన రాహుల్‌ రజాక్‌ లార్జ్‌టకా యాప్‌ ద్వారా లోన్‌యా్‌పను క్రియేట్‌ చేసినట్లు తెలిపారు. కొత్తమాధవరం గ్రామానికి చెందిన కల్పన ఈ ఏడాది ఫిబ్రవరి 10న ఆండ్రాయిడ్‌ మొబైల్‌ ద్వారా లోన్‌యా్‌పలో రూ.10వేలు అప్పు పొందింది. ఆ యాప్‌ ద్వారా కొన్నాళ్లకు లోనుచెల్లించింది. ఇంకా కట్టాలని బెదిరింపులకు పాల్పడగా, ఈ ఏడాది ఫిబ్రవరి 16న తన పేటీయం ద్వారా రూ.24వేలు చెల్లించింది. అయినా 17న లక్షా 76వేలు ఇవ్వాలని లోను యాప్‌ నిర్వాహకులు బెదిరింపులకు పాల్పడటమే కాకుండా ఆమె మార్ఫింగ్‌ ఫోటోలను వారి కుటుంబ సభ్యుల వాట్స్‌పకు పంపించారు. డబ్బులు చెల్లించకుంటే నీ బంధువులు, సన్నిహితులకు ఇలాంటి మార్ఫింగ్‌ ఫోటోలు పెడతామని బెదిరించడంతో ఫిబ్రవరి 20న ఒంటిమిట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో మే 8న రాజంపేటకు చెందిన వెంకట ప్రణయ్‌, స్నేహిత్‌, ఇమ్రాన్‌ఖాన్‌లను అరెస్టు చేశామని, వారి డెబిట్‌ ఖాతాలను ఫ్రీజ్‌ చేసి 70 అనుమానిత బ్యాంకు ఖాతాలకు సంబంధించి రూ.2.5 కోట్లు ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు గుర్తించినట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి నిఘా ఉంచి 17న కోల్‌కత్తాలో రాహుల్‌ రజాక్‌ను అరెస్టు చేసి అక్కడి నుంచి వచ్చి సిద్దవటం కోర్టులో వారిని హాజరుపరిచామని, కోర్టు ఉత్తర్వుల మేరకు పోలీసు కస్టడీకి తీసుకుని...సైబర్‌ సెల్‌ ఒంటిమిట్ట సీఐ పురుషోత్తంరాజు, సైబర్‌ క్రైం సీఐ శ్రీధర్‌నాయుడు ఆధ్వర్యంలో ఎస్‌ఐ మధుసూధన్‌రావు, మధుమల్లేశ్వర్‌రెడ్డి, రవికుమార్‌ల ఆధ్వర్యంలో అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు తెలిపారు. ఈ కేసులో రజాక్‌తో పాటు మరో ఐదుగురు మహిళలను కూడా అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు తెలిపారు. లోను యాప్‌ నుంచి ఎటువంటి లోన్‌ తీసుకుని మోసపోవద్దని తెలిపారు.

Updated Date - 2023-05-25T23:14:14+05:30 IST