వైఎ్‌సఆర్‌ ఆసరాతో వెలుగు

ABN , First Publish Date - 2023-03-25T22:56:35+05:30 IST

వైఎ్‌సఆర్‌ ఆసరాతో పేద మహిళల జీవితాల్లో వెలుగు నింపిందని, ఈ పథకం కింద 3వ విడత జిల్లాలోని డీఆర్‌డీఏ, మెప్మా పరిధిలోని 24,915 డ్వాక్రా సంఘాలకు రూ.223.56 కోట్లు జమ చేశామని జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా తెలిపారు.

వైఎ్‌సఆర్‌ ఆసరాతో వెలుగు
డ్వాక్రా సంఘాలకు చెక్కు అందిస్తున్న జేసీ, జడ్పీ చైర్మన్‌ తదితరులు

జిల్లాలో 24,915 డ్వాక్రా సంఘాలకు రూ.223.56 కోట్లు జమ

రాయచోటి (కలెక్టరేట్‌), మార్చి 25: వైఎ్‌సఆర్‌ ఆసరాతో పేద మహిళల జీవితాల్లో వెలుగు నింపిందని, ఈ పథకం కింద 3వ విడత జిల్లాలోని డీఆర్‌డీఏ, మెప్మా పరిధిలోని 24,915 డ్వాక్రా సంఘాలకు రూ.223.56 కోట్లు జమ చేశామని జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా తెలిపారు. శనివారం ఏలూరు జిల్లా దెందులూరు నుంచి వైఎ్‌సఆర్‌ ఆసరా పథకం 3వ విడత రుణమాఫీ, స్వయం సహాయక సంఘాల సభ్యుల ఖాతాల్లో జమ చేసే బృహత్తర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్‌ ప్రారంభించారు. రాయచోటి కలెక్టరేట్‌లో జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, ఉమ్మడి జిల్లాల జడ్పీ చైర్మన్‌ ఆకేపాటి అమర్‌నాధరెడ్డి, డీఆర్‌డీఏ పీడీ సత్యనారాయణ, ఎల్డీయం వెంకటేశ్వర్‌రెడ్డి, డీఆర్‌డీఏ, మెప్మా సిబ్బంది, పొదుపు సంఘాల మహిళా సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. జాయింట్‌ కలెక్టర్‌, జెడ్పీ చైర్మెన్‌, డీఆర్‌డీఏ పీడీ తదితరుల చేతుల మీదుగా డ్వాక్రా సంఘాల లబ్ధిదారులకు రూ.223.56 కోట్ల చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ వైఎ్‌సఆర్‌ ఆసరా పథకం మూడో విడతకు సంబంధించి జిల్లాలో డీఆర్‌డీఏ, పట్టణ ప్రాంతాల్లోని మెప్మాలో జిల్లా మొత్తం 24,915 సంఘాలకు చెందిన 2,33,293 మంది మహిళల ఖాతాల్లో రూ.223.56 కోట్లు జమ చేశామన్నారు. డీఆర్‌డీఏ నుంచి 22,214 స్వయం సహాయక సంఘాల్లోని 2,08,174 మంది సభ్యులకు రూ.198.515 కోట్లు, పట్టణ ప్రాంతాల్లోని మెప్మా పరిధిలో ఉన్న 2701 సంఘాల్లోని 25,119 మంది మహిళలకు రూ.24.49 కోట్లు జమ చేశామని తెలిపారు. ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సహాయాన్ని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో డీపీఎం లక్ష్మీప్రసాద్‌, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మైథిలి, రాయచోటి ఇన్‌చార్జి ఎంపీడీవో, డీఆర్‌డీఏ, మెప్మా సిబ్బంది, పొదుపు సంఘాల మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - 2023-03-25T22:56:35+05:30 IST