గ్రంథాలయాలే విజ్ఞాన నిలయాలు

ABN , First Publish Date - 2023-05-25T22:46:22+05:30 IST

: గ్రంథాలయాలే విజ్ఞాన నిలయాలని జేవీవీ రాష్ట్ర ఉపా ధ్యక్షుడు తవ్వా సురేష్‌ రెడ్డి పేర్కొన్నారు.

గ్రంథాలయాలే విజ్ఞాన నిలయాలు
పుట్టపర్తి సర్కిల్‌లో నినాదాలిస్తున్న విద్యార్థులు

జేవీవీ ఆధ్వర్యంలో విద్యార్థుల ర్యాలీ

ప్రొద్దుటూరు అర్బన్‌, మే 25: గ్రంథాలయాలే విజ్ఞాన నిలయాలని జేవీవీ రాష్ట్ర ఉపా ధ్యక్షుడు తవ్వా సురేష్‌ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ప్ర కాశం జిల్లా నుంచి మరో గ్రంథాలయ ఉద్యమంలో భాగంగా బైక్‌ ర్యాలీ చేస్తూ ప్రొద్దుటూరుకు వచ్చిన ఉపాధ్యాయుడు మంచికంటి వెంకటేశ్వరరెడ్డి స్ఫూర్తితో జేవీవీ ఆధ్యర్యంలో విద్యార్థులు శివాయం సర్కిల్‌ వరకు ర్యాలీ చేశారు.

వెంకటేశ్వరరెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ సెల్‌ ఫోన్‌ యూట్యూబ్‌ పేస్‌బుక్‌ లాంటి సోషల్‌ మీడి యా ప్రభావంతో విద్యార్ధుల్లో రానురాను పుస్తక పఠనాసక్తి తగ్గిపోతోందన్నారు. ప్రభు త్వ ప్రైవేటు పాఠశాల కళాశాలల్లో గ్రంథాలయాలు ఏర్పాటుచేసి విద్యార్థుల్లో భాషా పరిజ్ఞానం పెంపొందించవచ్చన్నారు. విరసం రాష్ట్ర మాజీ కార్యదర్శి వరలక్ష్మీ మాట్లాడుతూ నేటి సమాజానికి శస్త్ర చికిత్స అవసరం వుందన్నారు. యువత సోషల్‌ మీడియా ప్రభావంతో పెడదోవ పడుతున్నారన్నారు. కార్యక్రమంలో జేవీవీ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-25T22:46:22+05:30 IST