‘జగనన్నకు చెబుదాం’ పరిష్కారం త్వరగా జరగాలి

ABN , First Publish Date - 2023-05-31T23:30:30+05:30 IST

జగనన్నకు చెబుదాం స్పందన అర్జీల పరిష్కారం త్వరగా జరగాలని కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా తహసీల్దార్లను ఆదేశించారు.

‘జగనన్నకు చెబుదాం’ పరిష్కారం త్వరగా జరగాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీషా

అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా

రాయచోటి(కలెక్టరేట్‌), మే 31: జగనన్నకు చెబుదాం స్పందన అర్జీల పరిష్కారం త్వరగా జరగాలని కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా తహసీల్దార్లను ఆదేశించారు. బుధవారం రాయచోటి కలక్టరేట్‌ నుంచి జగనన్నకు చెబుదాం అర్జీలపై ఆర్డీఓలు, తహసీల్దార్లతో నిర్వహిం చిన వీడియో కాన్ఫరెన్సలో ఆయన మాట్లాడుతూ ఆర్డీఓ, తహసీల్దార్‌ లాగినలో ఉన్న రీఓపెన అర్జీలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఒకవేళ చర్య తీసుకోలేకపోతే ఎందుకు తీసుకోలేకపోతున్నామన్న వివరాలను స్పష్టంగా అర్జీదారునికి తెలియజేయాలన్నా రు. తీసుకున్న చర్య గురించి సవివరంగా నాణ్యమైన నివేదిక, సంబంధిత ఫొటోలు స్పందన ఆనలైనలో నమోదు చేయాలని సూచించారు. వివిధ మండలాలకు సంబంధించి రీఓపెన అయిన అర్జీల్లో తహసీల్దార్లు ఏ విధంగా ఎండార్స్‌మెంట్‌లు ఇచ్చారు. అర్జీదారుడు లేవనెత్తిన సమస్యపై ఎలా ఎండార్స్‌మెంట్‌ చేయాలన్న విషయమై కలెక్టర్‌ దిశా నిర్దేశం చేశారు. అర్జీలను నిర్ణీత కాలపరిమితిలోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. బియాండ్‌ ఎస్‌ఎల్‌ఏలోకి వెళ్లరాదని చెప్పారు. అంతకుముందు రాజంపేట డివిజనకు సంబంధించి అసైనమెంట్‌ భూముల అంశంలో ప్రగతిపై సంబంధిత డివిజన తహసీల్దార్లతో కలెక్టర్‌ సమీక్షించి తగు సూచనలు జారీ చేశారు.

Updated Date - 2023-05-31T23:30:30+05:30 IST