ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకుందాం

ABN , First Publish Date - 2023-06-26T23:44:31+05:30 IST

జాతీయ నూతన విద్యావిధానాన్ని అమలు చేసే సాకుతో జీవో 117ను అమలు చేస్తూ ప్రభుత్వ పాఠశాలలను కుదించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని... ఈ ప్రమాదాన్ని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు గుర్తించి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని యూటీఎఫ్‌ రాష్ట్రకార్యదర్శి లక్ష్మీరాజా, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాదన విజయకుమార్‌, పాలెం మహే్‌షబాబు డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకుందాం

యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా

కడప (ఎడ్యుకేషన్‌), జూన్‌ 26 : జాతీయ నూతన విద్యావిధానాన్ని అమలు చేసే సాకుతో జీవో 117ను అమలు చేస్తూ ప్రభుత్వ పాఠశాలలను కుదించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని... ఈ ప్రమాదాన్ని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు గుర్తించి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని యూటీఎఫ్‌ రాష్ట్రకార్యదర్శి లక్ష్మీరాజా, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాదన విజయకుమార్‌, పాలెం మహే్‌షబాబు డిమాండ్‌ చేశారు. సోమవారం కడప నగరం యూటీఎ్‌ఫ జిల్లా కార్యాలలంలో రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన బడిలో విద్యార్థులను చేర్పిద్దాం, ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడదాం అనే కరపత్రం ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా విద్యారంగాన్ని, ఉపాధ్యాయ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తోందన్నారు. తత్ఫలితంగా పేద, బడుగు, బలహీనవర్గాల విద్యార్థులకు విద్య అందని మేడిపండులా తయారైందన్నారు. ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా జీవో నెం.117 అమలు చేస్తూ 3,4,5 తరగతులను కిలో మీటరు పరిధిలో ఉన్నత పాఠశాలలో విలీనం చేశారన్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ప్రాఽథమిక పాఠశాలలు మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని తెలిపారు. ఒక పక్క నాడు-నేడు, జగనన్న విద్యాకానుక, అమ్మఒడి, జగనన్న గోరుముద్దలాంటి పథకాల ద్వారా ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తామని పేర్కొంటూనే మరో పక్క ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే కుట్రకు పాల్పడడం దారుణమన్నారు. తక్షణం జీవో నెం.117ను ఉపసంహరించుకోవాలని కోరారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ నాయకులు వై.రవికుమార్‌, కె.చెన్నయ్య, కిరణకుమార్‌, పవన్‌కుమార్‌, కంచిరెడ్డి, గోపినాధ్‌, భాస్కర్‌రెడ్డి, క్రిష్ణయ్య, ఈశ్వర్‌రావు, రామచంద్రయ్య పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T23:44:31+05:30 IST