సమష్టి కృషితో టీడీపీని మరింత బలోపేతం చేద్దాం
ABN , First Publish Date - 2023-07-21T23:10:30+05:30 IST
సమష్టి కృషితో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేద్దామని, జమ్మలమడుగు టీడీపీ ఇన్‌చార్జి దేవగుడి భూపేశ్‌రెడ్డి, మాజీఎమ్మెల్సీ శివనాథరెడ్డి పిలుపునిచ్చారు.
మాజీఎమ్మెల్సీ శివనాథరెడి ్డ, ఇన్‌చార్జి భూపేశ్‌రెడ్డి
జమ్మలమడుగు, జూలై 21: సమష్టి కృషితో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేద్దామని, జమ్మలమడుగు టీడీపీ ఇన్‌చార్జి దేవగుడి భూపేశ్‌రెడ్డి, మాజీఎమ్మెల్సీ శివనాథరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం జమ్మలమడుగు టీడీపీ కార్యాలయంలో పెద్దముడియం మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలకు క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్‌చార్జిలతో ఇంటిగ్రేటెడ్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రతి ఒక్కరిని ఆయా గ్రామాల్లో పార్టీపరంగా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో టీడీపీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం వ్యతిరేక విధానాలు తెలియజేసి వచ్చే ఎన్నికల్లో టీడీపీ జమ్మలమడుగు నియోజకవర్గంలో జెండా రెపరెపలాడేలా కృషి చేయాలన్నారు. గ్రామాల్లో దొంగ ఓట్లు ఏమైనా ఉంటే తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రమణారెడ్డి, శ్రీనివాసులు పాల్గొన్నారు.
అమలు కాని హామీలిచ్చి పేదలను మోసం చేస్తున్న జగన్
రాష్ట్రంలో అమలు చేయలేని లేనిపోని హామీలిచ్చి పేద, మధ్యతరగతి ప్రజలను అన్నివిధాలా మోసం చేస్తున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని వచ్చే ఎన్నికల్లో గద్దె దింపాలని జమ్మలమడుగు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి దేవగుడి భూపేశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని బెల్లాల వీధి, ఎస్‌పీజీ క్వార్టర్స్ ప్రాంతాల్లో భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా భూపేశ్‌రెడి ్డ, మాజీఎమ్మెల్సీ శివనాథరెడ్డి ఇంటింటికి వెళ్లి భవిష్యత్తుకు గ్యారెంటీ కరపత్రాలు అందజేశారు. టీడీపీ నాయకులు రమణారెడ్డి, రాయల్‌కిరణ్, ప్రశాంత్, బండి సుబ్బరాయుడు, సాయిస్వరూప్, గురుస్వామి, గంగాప్రసాద్, సూర్యారాయల్ పాల్గొన్నారు.