కొండాపురం పోస్టుమాస్టర్‌ ఆత్మహత్య

ABN , First Publish Date - 2023-05-26T23:31:23+05:30 IST

కొండాపురం పోస్టాఫీ్‌సలో పోస్టుమాస్టర్‌గా పనిచేస్తున్న కొండు నాగప్రవీణ్‌కుమార్‌రెడ్డి (31) ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

కొండాపురం పోస్టుమాస్టర్‌ ఆత్మహత్య

గండికోట బ్యాక్‌వాటర్‌లో మృతదేహం లభ్యం

కొండాపురం, మే 26: కొండాపురం పోస్టాఫీ్‌సలో పోస్టుమాస్టర్‌గా పనిచేస్తున్న కొండు నాగప్రవీణ్‌కుమార్‌రెడ్డి (31) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వివరాల మేరకు.. కొండాపురం గ్రామానికి చెందిన నాగప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఈనెల 24వ తేదీ ఉదయం ఇంటి నుంచి విధుల నిమిత్తం వెళ్లాడు. డ్యూటీ నుంచి ఇంటికి తిరిగిరాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొండాపురం పంప్‌హౌస్‌ వద్ద ఇతనికి చెందిన బైకు, చెప్పులు లభించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చా రు. దీంతో పంప్‌హౌస్‌ వద్దనున్న బ్యాక్‌వాటర్‌లో పోలీసుల ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం బ్యాక్‌వాటర్‌లో లభ్యమైనట్లు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు. మృతికి గల కారణాలను విచారిస్తున్నా మన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2023-05-26T23:31:23+05:30 IST