పరిసరాలను పరిశుభ్రతగా ఉంచుకోవాలి
ABN , First Publish Date - 2023-02-24T23:32:21+05:30 IST
ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మలేరియా అధికారిణి నాగలక్ష్మీరెడ్డి తెలిపారు.
కమలాపురం రూరల్, ఫిబ్రవరి 24 : ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మలేరియా అధికారిణి నాగలక్ష్మీరెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక జెండామానువీధిలో జరిగిన ఫ్రైడే, డ్రైడే కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాధులు ప్రబలకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. చుట్టుపక్కల నీరు ని ల్వకుండా చూడాలన్నారు. నీరు నిల్వ ఉంటే అందులో దోమలు వృద్ది చెంది తద్వారా విష జ్వరాలు సోకే ప్రుమాదం ఉందన్నారు. వారానికి ఒకసారి తమ ఇళ్లల్లోని తొట్లు, కుండలు శుభ్రం చేసుకుని ఎండకు ఆరబెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌హెచ్‌పీ జ్యోతి, ఎఎన్‌ఎం అరుణ ఆశాలు పాల్గొన్నారు.