కందుకూరి వీరేశలింగం తెలుగుజాతికి గర్వకారణం
ABN , First Publish Date - 2023-04-16T23:31:02+05:30 IST
తెలుగుజాతి గర్విం చగ్గ మహోన్నత వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు అని ఏపీ మహిళా సమాఖ్య అన్న మయ్య జిల్లా నాయకురాలు మర్రి సుమిత్ర అ న్నారు.
రాయచోటిటౌన, ఏప్రిల్ 16: తెలుగుజాతి గర్విం చగ్గ మహోన్నత వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు అని ఏపీ మహిళా సమాఖ్య అన్న మయ్య జిల్లా నాయకురాలు మర్రి సుమిత్ర అ న్నారు. కందుకూరి జయంతి సందర్భంగా ఆది వారం పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో మహి ళా సమాఖ్య ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంఘంలోని దురాచారాలను రూపుమాపడానికి ఆయన కృషి చిరస్మరణీయ మన్నారు. మహిళల కోసం వందకుపైగా పుస్తకాలు రచించిన మహోన్నతమైన వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య నియోజకవర్గ నాయకురాళ్లు సుబ్బమ్మ, స్వర్ణలత, శ్వేత, సునీత తదితరులు పాల్గొన్నారు.
రాజంపేట: స్థానిక సరస్వతీ విద్యా మందిరంలో తెలుగు భాషా సంరక్షణ సమితి జిల్లా సహాయ కార్యదర్శి గంగనపల్లి వెంకటరమణ, రాజంపేట మండల శాఖ అధ్యక్షుడు బొట్టు రామచంద్ర నాయుడు ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు భాష సంరక్షణకు కందుకూరి ఎంతో కృషి చేశారన్నారు. ప్రముఖ కవిగా, బహుముఖప్రజ్ఞాశాలిగా వీరేశలింగం గుర్తింపు పొందారన్నారు.