కడప జోనను లాభాల పట్టిస్తా..

ABN , First Publish Date - 2023-06-07T23:36:36+05:30 IST

ఆర్టీసీ తోటి ఉద్యోగుల (కండక్టర్లు, డైవర్ల) సంపూర్ణ సహకారంతో కడప జోనను లాభాల బాట పట్టించేందుకు కృషి చేస్తానని ఆర్టీసీ కడప జోన ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గిడుగు వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.

కడప జోనను లాభాల పట్టిస్తా..
కొత్త, పాత ఈడీలను అభినందిస్తున్న దృశ్యం

ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వరరావు

కడప (మారుతీనగర్‌) జూన 7: ఆర్టీసీ తోటి ఉద్యోగుల (కండక్టర్లు, డైవర్ల) సంపూర్ణ సహకారంతో కడప జోనను లాభాల బాట పట్టించేందుకు కృషి చేస్తానని ఆర్టీసీ కడప జోన ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గిడుగు వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కడప జోన పాత ఈడీగా సేవలందించిన కె. గోపీనాథ్‌రెడ్డి జోన-4 ఈడీగా విజయవాడకు బదిలీపై వెళ్లారు. కడప జోన ఈడీగా బాధ్యతలు స్వీకరించిన వెంకటేశ్వరరావు, ఆర్టీసీ క్లాస్‌-2 సూపర్‌వైజర్స్‌ అసోసియేషన, ఆర్టీసీ జిల్లా అద్దెబస్సుల యాజమాన్యం సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ఆర్‌ఎం కార్యాలయ సముదాయ భవన సమావేశ మందిరంలో వారిని సత్కారించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కరోనా తర్వాత తిరిగి ఆర్టీసీ లాభాల దిశగా సాగుతోందన్నారు. మున్ముందు ప్రయాణీకులకు మరింత మెరుగైన సేవలందించేందుకు సంస్థ సిద్ధంగా వుందని, తద్వారా ప్రజల విశ్వాసాన్ని మరింతగా అందిపుచ్చుకునేందుకు ఉద్యోగులను సమాయత్తం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్‌ఎం గోపాల్‌రెడ్డి, అసోసియేషన సూపర్‌వైజర్లు గోవర్థనరెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి, కన్యాకుమారి, అద్దెబస్సుల యాజమాన్యం నాయకులు గరుడాద్రి, బాస్కర్‌ పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-07T23:36:36+05:30 IST