Share News

కుక్కలు చింపిన విస్తరిలా కడప నగరం

ABN , Publish Date - Dec 17 , 2023 | 11:35 PM

ఎన్నికలను దృష్టిలో వుంచుకుని ఎలాగైనా నగర ప్రజలను బురి డీ కొట్టించి మరో సారి కడప అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందాలనే కుట్రతో ఇక్కడి వైసీపీ నేతలు నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామం టూ ప్రభుత్వం నుంచి రూ. 2,100 కోట్లను దండుకోవడం దారుణమని పలు పార్టీలు, ప్రజాసంఘ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశా రు.

కుక్కలు చింపిన విస్తరిలా కడప నగరం
రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతున్న ఎస్‌ఏ సత్తార్‌

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వైసీపీ పాలనపై

నిప్పులు చెరిగిన పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు

కడప (మారుతీనగర్‌) డిసెంబరు 17: ఎన్నికలను దృష్టిలో వుంచుకుని ఎలాగైనా నగర ప్రజలను బురి డీ కొట్టించి మరో సారి కడప అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందాలనే కుట్రతో ఇక్కడి వైసీపీ నేతలు నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామం టూ ప్రభుత్వం నుంచి రూ. 2,100 కోట్లను దండుకోవడం దారుణమని పలు పార్టీలు, ప్రజాసంఘ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఆ నిధులతో నగరంలోని వివిధ కూడళ్లకు ఇస్టానుసారంగా వివిధ రకాల విగ్రహాలను ఏర్పాటుచేస్తూ నగరాన్ని కుక్కలు చింపిన విస్తరిగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో నగర ప్రజలు నరక యాతన పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ మేరకు కాంగ్రె్‌సపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌ఏసత్తార్‌ అధ్యక్షతన అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో వివిధ పార్టీల, ప్రజాసంఽఘాలతో నిర్వహించిన రౌం డ్‌ టేబుల్‌ సమావేశంలో వారు మాట్లాడుతూ నా లుగున్నరేళ్లగా తేలు కుట్టిన దొంగలా మిన్నకున్న వైసీపీ కడప నేతలకు తీరా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కడపను అభివృద్ధి పరచాలనే ఆలోచన రావడం పట్ల నగర ప్రజలు సైతం ముక్కున వేలేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రధాన రోడ్లు బాగుచేసినంత మాత్రాన కడప నగరం అంతా అభివృద్ధి కాబడిందనుకోవడం వైసీపీ నేతల అవివేకమన్నారు. పేదలు నివశించే ప్రదేశాల్లో నేటికీ సమస్య లు తిష్టవేసి వున్నాయనే సంగతి వైసీపీ నేతలకు కూడా తెలుసన్నారు. అయినప్పటికీ మేడిపండు పైకి నిగనిగలాడుతున్నా లోన పురుగులుంటాయనే విధంగా నగరం పైకి బాగుచేసి ప్రజలను నమ్మించేందుకు వైసీపీ నేతలు నానా యాగి చేస్తున్నారని విమర్శించారు. ఈ విషయాన్ని ప్రజలకు సవివరం గా వివరించేందుకు సమాయత్తం అవుతున్నామన్నారు. సమావేశంలో గాలి చంద్ర, (సీపీఐ) రామ్మోహన్‌ (సీపీఎం) గుర్రప్ప (బీఎస్పీ) శ్రీనివాసులు (ఆమ్‌ఆద్మీపార్టీ) రవిశంకర్‌రెడ్డి (ఆర్‌సీపీ) దేవరశ్రీకృష్ణ (లోక్‌సత్తా) శ్యామలాదేవి (కాంగ్రె్‌స) తో పాటుగా పలువురు ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 11:35 PM