చేనేత కార్మికులకు అండగా జనసేన
ABN , First Publish Date - 2023-10-30T00:15:15+05:30 IST
చేనేత కార్మికులకు జనసేన ఎప్పుడూ అండగా ఉంటుందని ఆపార్టీ రాయలసీమ కో-కన్వీనర్ గంగారపు రామ్‌దాస్‌చౌదరి భరోసా ఇచ్చారు.
మదనపల్లె, అక్టోబరు 29: చేనేత కార్మికులకు జనసేన ఎప్పుడూ అండగా ఉంటుందని ఆపార్టీ రాయలసీమ కో-కన్వీనర్ గంగారపు రామ్‌దాస్‌చౌదరి భరోసా ఇచ్చారు. జనం కోసం జనసేన పట్టణబాటలో భాగంగా ఆది వారం నీరుగట్టువారిపల్లెలో పర్యటించారు. ఇందులోభాగంగా చేనేత కార్మికులు ఎదుర్కొం టున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఇచ్చి న హామీలను విస్మరించిందని ఏకరువు పెట్టారు. ఆరునెలల్లో అధికారంలోకి రానున్న జనసేన, టీడీపీ ప్రభుత్వం చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ పరిష్క రిస్తుందని హామీ ఇచ్చారు. ఈసందర్భంగా పురం నగేష్ ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, అడపా సురేంద్ర, మండల అధ్యక్షుడు గ్రానైట్ బాబు, చంద్రశేఖర్, లక్ష్మిప తి, అర్జున, జవిలి, మోహనకృష్ణ, నాగ, రాజారెడ్డి, నరేష్, లక్ష్మీనా రాయణ, రెడ్డిశేఖర్‌రెడ్డి, నవాజ్, జనార్దన, నాగరాజు, హరిబాబు, నరసింహ, సుధాకర్ పాల్గొన్నారు.