తిరుపతికి తరలివెళ్లిన జనసేన నాయకులు
ABN , First Publish Date - 2023-09-23T23:47:44+05:30 IST
తిరు పతిలో శనివారం జరిగిన ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ సమీ క్ష సమావేశానికి మదనపల్లె జన సేన నాయకులు తరలివెళ్లారు.
మదనపల్లె, సెప్టెంబరు 23: తిరు పతిలో శనివారం జరిగిన ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ సమీ క్ష సమావేశానికి మదనపల్లె జన సేన నాయకులు తరలివెళ్లారు. రానున్న ఎన్నికల ను దృష్టిలో పెట్టుకుని పార్టీని బలోపేతం చేయడం, ఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరుపై ఈ సమీక్షలో పార్టీ రాష్ట్రప్రధాన కార్యదర్శి నాగబాబు, మీడియా రాష్ట్రఅధికార ప్రతినిధి అజయ్‌కుమార్‌లు పార్టీనేతలతో చర్చించనున్నారు. రెండురోజుల పార్టీ జరిగే ఈ సమా వేశాలకు పార్టీ నియోజకవర్గ ఇనఛార్జి గంగారపు స్వాతి, రాయలసీమకో-కన్వీనర్ గంగా రపు రామ్‌దాస్‌చౌదరి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో వెళ్లారు. అలాగే ఆపార్టీ నాయకులు శ్రీరామ రామాంజనేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, మైఫోర్సు మహేష్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు వేర్వేరుగా వెళ్లారు.