జగన పర్యటన వల్ల ప్రజాధనం దుర్వినియోగం : టీడీపీ
ABN , First Publish Date - 2023-09-04T00:01:18+05:30 IST
ముఖ్యమంత్రి వైఎస్ జగన మోహనరెడ్డి జిల్లాలోని ఇడుపులపాయ పర్యటన వల్ల ప్రజాధనం దుర్వినియోగం అ యిందని టీడీపీ మండల కన్వీనర్ రామమునిరెడ్డి ఆరోపించారు.
వేంపల్లె, సెప్టెంబరు 3: ముఖ్యమంత్రి వైఎస్ జగన మోహనరెడ్డి జిల్లాలోని ఇడుపులపాయ పర్యటన వల్ల ప్రజాధనం దుర్వినియోగం అ యిందని టీడీపీ మండల కన్వీనర్ రామమునిరెడ్డి ఆరోపించారు. వేంపల్లెలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొద్దిరోజులుగా వ ర్షాలు పడక రైతులు వేసిన పంటలు ఎండిపోయాయని అధికారుల సమీక్షతో రైతులకు మేలు చే యాలన్న ఆలోచన చేయకపోవడం శోచనీయమన్నారు. పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా రైతులు పంట దెబ్బతిని నష్టపోయారన్నారు. పంటలబీమా మంజూరయ్యేలా ప్రభు త్వం చొరవ చూపాలన్నారు. విలేకరుల సమావేశంలో వక్ఫ్‌బోర్డు చైర్మన ద ర్బార్, టీడీపీ పట్టణ అద్యక్షులు ఆర్వీ రమేష్, నందిపల్లె రామగంగిరెడ్డి, పాములూరు చంటి, గోగుల మల్లికార్జున, పోతిరెడ్డి శివ, డక్కా రమేష్ పాల్గొన్నారు.