నమ్మించి మోసగించిన జగన్!
ABN , Publish Date - Dec 17 , 2023 | 10:58 PM
అధికార దాహంతో అంగన్‌వాడీలకు హామీలు గుప్పించి నమ్మించిన జగన్‌మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే మోసం చేశాడని ఏఐటీయూసీ జిల్లా కన్వీనర్ నాగేశ్వరి తెలిపారు.
17పీఎల్‌ఆర్05:
సుండుపల్లె, డిసెంబరు 17: అధికార దాహంతో అంగన్‌వాడీలకు హామీలు గుప్పించి నమ్మించిన జగన్‌మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే మోసం చేశాడని ఏఐటీయూసీ జిల్లా కన్వీనర్ నాగేశ్వరి తెలిపారు. అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ 6వ రోజు ఆదివారం అంగన్‌వాడీ చిన్నారులతో కలిసి నిరసన తెలిపారు. సమస్యలను పరిష్కరించకపోతే రాబో యే ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదని హెచ్చ రించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం అందించే అంగన్‌వాడీ కార్యకర్తలపై ప్రభుత్వం కక్ష సాధింప చర్యలుకు దిగడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
హామీలు ఏమయ్యాయి?
లక్కిరెడ్డిపలె: లక్కిరెడ్డిపల్లెలో యూనియన్ అధ్యక్షురాలు సుకుమారి మాట్లాడుతూ పాదయాత్ర లో అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలు ఏమయ్యా యని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నోరు మెదపలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని రోజులైనా సమ్మె కొనసాగిస్తామన్నారు. సచివాలయ సిబ్బంది అంగన్‌వాడీ కేంద్రాల్లోని వస్తువులను పగులగొడుతున్నారని, ఎలాంటి నష్టం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు.
రాజకీయ వేధింపులు ఆపాలి
రైల్వేకోడూరు: రాజకీయ వేధింపులు ఆపాలని అంగ న్‌వాడీ నాయకురాళ్లు శ్రీలక్ష్మీ, రమాదేవి, శిరీషా, పద్మా, లీలా, దుర్గా, రాఽధ డిమాండు చేశారు. ఆదివారం రైల్వేకోడూరు ఐడీడీసీఎస్ కార్యాలయం ఎ దుట వారు మాట్లాడుతూ గౌరవ వేతనాలు వద ్దని, కనీస వేతనాలు కావాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు ఉద్యమాలు ఆగవని తె లిపారు. ప్రస్తుత ధరలకు అనుగుణంగా అంగన్వా డీ కేంద్రాలకు సరుకులు అందించాలన్నారు. ప్రభు త్వ సంక్షేమ కార్యక్రమాల్లో అంగన్వాడీలను చేర్చాలన్నారు. వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్గించాలన్నారు. బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. సర్వీస్‌లో చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, బీమా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వయోపరిమితి 62కు పెంచాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖర్, ఏఐటీయూసీ నా యకులు మాదాసు గంగాధర్, పాల్గొన్నారు.
తాళాలు బద్దలు కొట్టిన వారిని అరెస్టు చేయాలి
సంబేపల్లె: అంగన్‌వాడీ కేంద్రాలకు తాళాలు పగుల గొట్టిన దొంగలను వెంటనే అరెస్టు చేయాలని అన్న మయ్య జిల్లా అంగన్‌వాడీ కార్యకర్తల సంఘం అధ్యక్షురాలు భాగ్యమ్మ డిమాండ్ చేశారు. ఆది వా రం తహసీల్దారు కార్యాలయం ఎదుట నిరసన తెలి యజేశారు. తమ న్యాయమైన డిమాండ్లను రా ష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె కొనసాగిస్తామని తెలిపారు. ‘దోపిడీ రాజ్యం.. దొంగల రాజ్యం’ అని నినాదాలు చేస్తూ తహసీల్దారు కార్యాలయం ఎదుట మోకాళ్ల పై నిలబడి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్ర మంలో సంబేపల్లె మండల అంగన్‌వాడీ కార్యకర్తల సంఘం అధ్యక్షురాలు అనసూయమ్మ, లక్ష్మీదేవి, పద్మజ, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
సమస్యలు ప్రభుత్వానికి పట్టవా?
రాయచోటి టౌన్: అంగన్‌వాడీల సమస్యలు ప్రభుత్వానికి పట్టవా అంటూ రాయచోటి ప్రజా సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం స్థానిక తహసీల్దారు కార్యాలయానికి సమీపంలోని అంబేడ్కర్ ఫ్లెక్సీ వద్ద 6వ రోజు కూడా అంగన్‌వాడీల సమ్మె కొనసాగింది. ఈ సమ్మెకు ఎంఆర్‌పీఎస్ జాతీయ నాయకుడు ఎస్.రామాంజనేయులు, ఓఎఫ్‌డీఆర్ రాష్ట్ర సహాయ కార్యదర్శి టి.ఈశ్వర్, భారతీయ అంబేడ్కర్ జనసేన రాష్ట్ర అధ్యక్షుడు పల్లం తాతయ్య, రజక సంఘం రాయచోటి అధ్యక్షుడు రమేశ్ బాబు, న్యాయవాది నాగముని, పామయ్య తదితరులు ధర్నాకు హాజరై సంఘీభావం తెలిపారు. లీడర్లు బాంగారు పాప, ఖాజాబీ, పద్మజ, సబీనా, గౌసియా, రాముమల్మ, సునీత, స్వప్న, సురేఖ, తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ మద్దతు
చిట్వేలి: అంగన్‌వాడీల ఆందోళనకు సీఐటీయూ, నా యకులు మద్దతు తెలిపారు. అంగన్‌వాడీ వర్కర్, సీఐటీయూ కార్యదర్శి సుజాత, సుధామని, కేవీపీ ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంచలయ్య, పెనమ లూరు మండలం సీఐటీయూ కార్యదర్శి ప్రసాద్, అన్నపూర్ణ, ఉమాదేవి, భాను, శిరీష, సులోచన, సు బ్బరత్నమ్మ, దేవి, శ్యామల పాల్గొన్నారు.
==============================