Share News

పూర్వవైభవం కలేనా..?

ABN , Publish Date - Dec 17 , 2023 | 11:38 PM

సిద్దవటానికి గత వైభ వం కలగా మిగిలేలా ఉంది. ఇక్కడ శైవ క్షేత్రాలు, ప్రాచీన కట్టడాలెన్నో ఉన్నాయి. మండలంలోని జ్యోతి క్షేత్రం అభివృద్ధిలో శ్రీశైలం నుంచి నిధులు మంజూరు చేస్తున్న విషయం 2016లో వెలికి తీశా రు. జిల్లా కేంద్రంగా సిద్దవటం, జిల్లాకు మొదటి కలెక్టరేట్‌ ఇక్కడే ఉంది. ప్రస్తుతం తహసీల్దారు కార్యాలయమే అప్పటి కలెక్టరేట్‌. సిద్దవటానికి పూర్వవైభవం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని జ్యోతి దేవాలయాలు (శైవ క్షేత్రాలు) అభివృద్ధి చేసి టూరిజం హబ్‌గా మార్చాలని స్థానిక ప్ర జలు పలువురు పర్యాటక అభిమానులు కోరుతున్నారు.

పూర్వవైభవం కలేనా..?
అపరిశుభ్రంగా దర్శనమిస్తున్న జ్యోతి దేవాలయం

సిద్దవటంలో అభివృద్ధికి నోచుకోని శైవ క్షేత్రాలు

జ్యోతికి శ్రీశైలం నిధుల మాటేమిటి ?

ప్రాచీన ఆలయాలు పర్యాటక ప్రదేశాలుగా మారేనా.. ?

సిద్దవటం, డిసెంబరు 17: సిద్దవటానికి గత వైభ వం కలగా మిగిలేలా ఉంది. ఇక్కడ శైవ క్షేత్రాలు, ప్రాచీన కట్టడాలెన్నో ఉన్నాయి. మండలంలోని జ్యోతి క్షేత్రం అభివృద్ధిలో శ్రీశైలం నుంచి నిధులు మంజూరు చేస్తున్న విషయం 2016లో వెలికి తీశా రు. జిల్లా కేంద్రంగా సిద్దవటం, జిల్లాకు మొదటి కలెక్టరేట్‌ ఇక్కడే ఉంది. ప్రస్తుతం తహసీల్దారు కార్యాలయమే అప్పటి కలెక్టరేట్‌. సిద్దవటానికి పూర్వవైభవం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని జ్యోతి దేవాలయాలు (శైవ క్షేత్రాలు) అభివృద్ధి చేసి టూరిజం హబ్‌గా మార్చాలని స్థానిక ప్ర జలు పలువురు పర్యాటక అభిమానులు కోరుతున్నారు. సిద్దవటం ప్రాంతంలో ఉన్నన్ని శివాలయా లు, ప్రాచీన కట్టడాలు జిల్లాలో మరెక్కడా లేవనేది చరిత్ర చెబుతున్న సత్యం. ఈ ప్రాంతంలో మొదట జైన,తర్వాత, బౌద్ధం, వైష్ణవం, శైవమతం వర్ధిల్లిన ట్లు చారిత్రాక ఆధారాలు బట్టి తెలుస్తోంది. ఇక్కడి నుంచే శైవమతం జిల్లా అంతటా వ్యాప్తి చెందినట్లు తెలుస్తోంది.

ఇక్కడ ప్రాచీన కాలంలో మర్రిచెట్లు(వటవృక్షాలు) ఎక్కువగా ఉండేవని ఆ చెట్ల కిం ద సిద్దులు తపస్సు చేసేవారని అందుకే దీనికి సిద్దవటం అనే పేరు వచ్చినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. కొన్ని వందల ఏళ్ల నాటి ప్రాచీన కట్టడాలు, పురాతన ఆలయాలు ఈ ప్రాంతంలో అనే కం ఉన్నాయి. ప్రధానంగా ఉదయగిరి సామంతరాజులు, మట్లిరాజులు పాలించిన సిద్దవటం కోట ఉంది. ఈ కోటను 16 మంది రాజవంశీకులు పాలించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. రెండో భద్రాద్రిగా పిలువబడుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం గతంలో సిద్దవటం మండలంలో ఉండేదని ప్రముఖ రచయిత సాహితీ వేత్త కట్టా నరసింహులు తన పుస్తకంలో రాశారు. సిద్దవటానికి ఉత్తరం వైపు నిత్యపూజస్వామి కోన, తూ ర్పున కపిల్తీశ్వర కోన, దక్షిణాన మందగిరి కొండ లు, భాకరాపేట ఉన్నాయి. 11వ శతాబ్ధంలో రాష్ట్ర కూట చక్రవర్తుల్లో ఒకరైన మూడో క్రిష్ణుడు మాచుపల్లెలో ఉన్న రేణుకా యల్లమాంబ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు ప్రతీతి. మాచుపల్లె, టక్కోలి, పొన్నవో లు ప్రాంతాలను సంబెట గురవరాజు పాలించిన ట్లు చరిత్ర తెలుపుతోంది. ఈ ప్రాంతాన్ని హిరణ్య రాష్ట్రం పిలిచేవారని చరిత్రకారులు చెబుతారు. జ్యోతి క్షేత్రాల చుట్టూ ప్రాచీన శివాలయాలు అనే కం ఉన్నాయి. ఇందులో వనేశ్వరం అనేది అతి పురాతనమైంది. వనవాసం సమయంలో సీతారాములు ఇక్కడ సంచరించారని అందుకే దీనికి వనేశ్వరం అని పేరు వచ్చినట్లు ప్రతీతి. ఇక్కడ ఒక మునీశ్వరుడు తపస్సు చేశాడని అందుకే దీనిని మునేశ్వరం అని కూడా అంటారని స్థానికుల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఇది కాలక్రమేణా మునీశ్వర వనేశ్వరంగా మారిందంటారు. ఇవన్నీ లంకమల అభయారణ్యంలో ఉన్నా యి.

కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతం, లంకమల నుంచి తిరుమల వరకు ఈ కొండలు వ్యాపించి ఉండడం విశేషం. ముఖ్యంగా ఈ ప్రాం తంలో జాంబవంతుని ఆనవాళ్లు అంటే శాసనాలు, విగ్రహాలు ఉండడం విశేషం. పూర్వం ఈ ప్రాంతా న్ని చోళులు, పల్లవులు రాష్ట్ర కూట చక్రవర్తులు పాలించారు. 14, 15వ శతాబ్ధంలో ఉదయగిరి సామంతరాజులు 16, 17వ శతాబ్ధంలో నవాబులు, 18, 19వ శతాబ్ధంలో ఆంగ్లేయులు (బ్రిటీషువారు) పరిపాలించారు. అంతకముందు జ్యోతి, సిద్దవటం ప్రాంతాలు రెండూ మహానగరాలుగా వర్ధిల్లాయని చెబుతారు. ఇసుకదిన్నెల్లో పూడి పోయిన జ్యోతి క్షేత్రాలను 2016లో శ్రీశైలం దేవస్థానం వారు వెలికి తీశారు. ఆతర్వాత అక్కడ మహాద్భుతమైన ఆలయ నిర్మాణం చేపడతామని ప్రకటించారే తప్ప అభివృ ద్ధి శూన్యమని చెప్పవచ్చు. ఈ ఆలయం శ్రీశైలం అధీనంలో ఉందని శాసనాల ఆధారం తెలుస్తోంది. ఈమేరకు కడప వాసి ప్రముఖ న్యాయవాది, ఇన్‌ టాక్‌ లైఫ్‌ మెంబర్‌ భారవి ప్రశ్నించడంతో శ్రీశైలం ప్రతినిధులు ఆలయాన్ని కడప జిల్లాకు చెందిన ఏసీ శంకర్‌ బాలాజీతో కలిసి పరిశీలించారు. అయి నా ఇంత వరకూ పనులు జరగలేదని తెలుస్తోంది. వారి నిర్లక్ష్యానికి పరాకాష్టగా మారింది.

కర్నాటక రాష్ట్రంలోని కోలార్‌ నుంచి ప్రవహించే పెన్నానదిని హద్దుగా చేసుకుని ఒక ప్రాంతాన్ని ఉత్తరాది రాజు లు, మరో ప్రాంతాన్ని దక్షిణాది రాజులు పాలించిన ట్లు పలువురు చరిత్రకారులు చెబుతారు. అందుకే ఈ ప్రాంతానికి ప్రాధాన్యత, ప్రాశస్త్యం ఉందంటా రు. ఇంతటి గొప్ప ప్రాచీన చరిత్ర కలిగిన ఈ సిద్దవటం ప్రాంతానికి పూర్వవైభవం తీసుకురావాల్సిన అవసరం ఉందని ఇక్కడ టూరిజం అభివృద్ధి చెం దాలంటే సిద్దవటం నుంచి పొన్నవోలు కొత్తపల్లె వరకు రోడ్డు వెడల్పు చేయాలని కోరుతున్నారు. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధి కోసం కోట్లరూపాయ లు ఖర్చు పెడుతోంది. కనుక సిద్దవటంపై ఇటు అధికారులు, అటు ప్రభుత్వం దృష్టి సారించి అభివృద్ధి చేయాలని చరిత్రకారులు, ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Dec 17 , 2023 | 11:38 PM