అక్రమాల పై ప్రశ్నిస్తే షోకాజ్ నోటీసులా?
ABN , First Publish Date - 2023-03-05T22:58:15+05:30 IST
ఉపాధ్యాయుల పని సర్దుబాటులో నిబంధనలకు వ్యతిరేకం గా వ్యవహరించిన జిల్లా విద్యాశాఖాధికారి అక్రమాలను ప్రశ్నిస్తే ఉపాధ్యాయ సంఘం నేతలకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం దారుణమని ఫ్యాప్టో జిల్లా చైర్మన్ మాదన విజయకుమార్, యూటీ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా ఆవేదన వ్యక్తం చేశారు.
ఫ్యాప్టో, యూటీఎఫ్ నేతల మండిపాటు
కడప (ఎడ్యుకేషన్)/వేంపల్లె, మా ర్చి 5: ఉపాధ్యాయుల పని సర్దుబాటులో నిబంధనలకు వ్యతిరేకం గా వ్యవహరించిన జిల్లా విద్యాశాఖాధికారి అక్రమాలను ప్రశ్నిస్తే ఉపాధ్యాయ సంఘం నేతలకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం దారుణమని ఫ్యాప్టో జిల్లా చైర్మన్ మాదన విజయకుమార్, యూటీ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల నామినేషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారనే నెపంతో కొంద రు ఉపాధ్యాయ సంఘ నేతలకు షోకాజ్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ ఆదివారం యూటీఎఫ్ భవన్‌లో ఉపాధ్యాయ సంఘాల (ఫ్యాప్టో) జిల్లా కార్యవర్గ సమావేశంలో జిల్లా చైర్మన్ మాట్లాడుతూ ఇటీవల విద్యాశాఖాధికారులు ఏదో ఒక కారణంతో ఉపాధ్యాయుల ను వేదించడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు.
పాఠశాలల తనిఖీ పేరుతో ఒక పక్క ఉపాధ్యాయులను వేధిస్తున్నారని విమర్శించారు. జిల్లాలో ఇటీవల చేపట్టిన ఉపాధ్యాయుల పని సర్దుబాటులో డీఈఓ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించడాన్ని ప్రశ్నించిన యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు ఉద్దేశపూర్వకంగా షోకాజ్ నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండించామన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మిరాజా, రూటా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఇక్బాల్, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి, ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్లా, యూటీఎఫ్ జిల్లా ప్రఽధాన కార్యదర్శి పాలెం మహేశ్‌బాబు తదితరులు మాట్లాడారు.
వేంపల్లెలో నిర్వహించిన సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ జాయింట్ స్టెప్ కౌన్సిల్‌లో శాశ్వత సభ్యత్వం కలిగిన సంఘాలు ప్రాతినిధ్యం చేసిన అంశాలకు సమాధానాలు ఇవ్వాల్సిన బాధ్యత డీఈఓకు ఉందన్నారు. షోకాజ్ నోటీసులను వెంట నే ఉపసంహరించుకోవాలని కోరారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి చెరుకూరి శ్రీనివాసులు, రాష్ట్ర కౌన్సిలర్ కృష్ణారెడ్డి, మండల నేతలు పాల్గొన్నారు.