అయోడిన్‌ లోపంతో అనర్థాలు అనేకం

ABN , First Publish Date - 2023-02-08T23:31:24+05:30 IST

ప్రజలు అయోడిన్‌ ఉన్న ఉప్పు మాత్ర మే వాడాలని, అయోడిన్‌ లోపిస్తే వచ్చే అనర్ధాలు అనే కంగా ఉంటాయని డిప్యూటీ డీఎంహెచ్‌వో శాంతికళ అన్నారు.

అయోడిన్‌ లోపంతో అనర్థాలు అనేకం
అయోడిన్‌ ఉప్పుపై విద్యార్థులకు సలహాలు ఇస్తున్న వైద్యాధికారులు

ప్రొద్దుటూరు రూరల్‌, ఫిబ్రవరి 8 : ప్రజలు అయోడిన్‌ ఉన్న ఉప్పు మాత్ర మే వాడాలని, అయోడిన్‌ లోపిస్తే వచ్చే అనర్ధాలు అనే కంగా ఉంటాయని డిప్యూటీ డీఎంహెచ్‌వో శాంతికళ అన్నారు. మండలంలోని కొత్తపల్లె గ్రామ పంచాయతీ టీచర్స్‌ కాలనీలో ఉన్న రాఘవేంద్ర హైస్కూలును ‘నేషనల్‌ అయోడిన్‌ డిఫెషియన్సీ డిజార్డర్‌ కంట్రోల్‌ ప్రోగ్రాం’లో భాగంగా బుధవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరు నుంచి 12 సంవత్సరాల్లోపు ఉన్న విద్యార్థులను పరీక్షించి 45 మంది అబ్బాయిలు, అమ్మాయిలతో ర్యాండమ్‌గా ప్రతి ఐదు గురికి ఒకరు చొప్పున 18 మందిని సెలక్ట్‌ చేసుకుని వారి ఇళ్లల్లో వాడుతున్న ఉప్పును పరిశీలిస్తున్నామన్నారు. ప్రతి పదిమందికి ఒకరు చొప్పున పదిమందిని సెలక్ట్‌ చేసి వారి మూత్రం శాంపిల్స్‌ తీసుకుని ల్యాబ్‌కు పంపి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కల్లూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాఽధికారి డాక్టర్‌ శివ ప్రసాద్‌, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ వెంకటేశ్వర్లు, హెచ్‌ఈవోలు వెంకటేశ్వర్లు, రాజశేఖర్‌, హెడ్మాష్టర్‌ కిరణ్మయి, సీహెచ్‌వో మౌనిక, ఏఎన్‌ఎం శ్యామల, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

కొండాపురం..: విద్యార్థుల్లో అయోడిన్‌ లోపం గుర్తించేందుకు మండలంలోని పలు పాఠశాలల్లో స్థానిక పీహెచ్‌సీ డాక్టర్‌ సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం వైద్యపరీక్షలు నిర్వహించారు. మండల పరిధిలోని తిమ్మాపురం, అనంతపురం, తిమ్మాపురం హరిజనవాడ ఎలిమెంటరీ పాఠశాలల్లో విద్యార్థులకు వైద్యపరీక్షలు నిర్వహించారు. ఎంపీహెచ్‌ఈఓ బాలనరనసింహులు, సిబ్బంది రాము, సత్యవాణి, హెచ్‌ఎం విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

బి.కోడూరు..: బి.కోడూరు మండల పరిధిలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రం, మేకవారిపల్లె ప్రాధమిక పాఠశాలలో బుధవారం వైద్యాధికారులు వినీత్‌కుమార్‌ రాజు, ఉదయ్‌కిరణ్‌ ఆధ్వర్యంలో ఆయోడిన్‌ ఉప్పును ప్రతి ఒక్కరూ వాడుదాం అన్న దానిపై విద్యార్థులకు సలహాలు, సూచనలు అందించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి వినీత్‌కుమార్‌ రాజు మాట్లాడుతూ అయోడిన్‌ ఉప్పు తీసుకోవడం వల్ల శారీరక, మానసిక ఎదుగుదలకు ఉపయోగం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణాధికారులు నరసింహారెడ్డి, జాన్‌ విలియం, దేవిక, ఆయేషా, రామతీర్థం, ఉపాధ్యాయులు రమణ, రమణమూర్తి, వేణు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-08T23:31:41+05:30 IST