నేటి నుంచి ‘ఇంటింటా నల్లారి’ పర్యటన
ABN , First Publish Date - 2023-06-11T23:52:12+05:30 IST
కలికిరి పట్టణం నుంచి ’ఇంటింటా నల్లారి’ పేరుతో సోమవారం సాయంత్రం నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి పర్య టన ఖరారు చేశారు.
కలికిరి, జూన 11: కలికిరి పట్టణం నుంచి ’ఇంటింటా నల్లారి’ పేరుతో సోమవారం సాయంత్రం నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి పర్య టన ఖరారు చేశారు. ఆదివారం నగరిపల్లెలో జరిగిన మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అనుబంఽధ విభాగాలతో కిశోర్‌కుమార్ రెడ్డి చర్చించిన అనంతరం పర్యటనను ఖరారు చేశారు. కలికిరి పం చాయతీ రెడ్డివారిపల్లె గ్రామంలోని అండేకురవపల్లె నుంచి ఇంటింటి పర్యటన చేపట్టాలని నిర్ణయించారు. గతంలో నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమాన్ని తిరిగి ఇంటింటికీ తీసుకెళ్ళాలని అభిప్రాయ పడ్డారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఇటీవల ప్రకటించిన ఐదు సంక్షే మ కార్యక్రమాల గురించి విస్తృతంగా ప్రచారం చేపట్టాలని నిర్ణయిం చారు. మండలంలోని నాయకులు, కార్యకర్తలు పట్టణంలో జరిగే వరుస కార్యక్రమాల్లో పాల్గొనాలని కిశోర్‌కుమార్ రెడ్డి కోరారు. ఇంటింటా నల్లారి కార్యక్రమంలో ప్రస్తుతం టీడీపీ ప్రకటించిన మహిళలకు మూడు ఉచిత సిలిండర్లు, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు మహిళలందరికీ నెల నెలా రూ.1500లు, నిరుద్యోగులకు నెల నెలా రూ.3 వేల భృతి, తల్లికి వందనం పథకం పేరుతో పాఠశాలకు వెళ్లే ప్రతి బిడ్డకూ రూ.15 వేలు, కేంద్రం ఇచ్చేదానితో సంబంధం లేకుండా ప్రతి రైతుకూ ఏడాదికి రూ. 20 వేలు వంటి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. సమావేశంలో మండల టీడీపీ అధ్య క్షుడు నిజాముద్దీన, కలికిరి సర్పంచ ప్రతాప్‌కుమార్ రెడ్డి, పార్లమెంటు ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్, ముస్తఫా హజరత, మాలతి, సహదేవ రెడ్డి, రెడ్డెప్పరెడ్డి, విజయకుమార్ రెడ్డి, ఆనందరెడ్డి, సుధాకర్‌రెడ్డి, మధుసూ దన రెడ్డి, వెంకటపతి, జ్ఞాన, వైజాగ్ బాషా తదితరులు పాల్గొన్నారు.