అంతర్రాష్ట బైకు దొంగల అరెస్ట్
ABN , First Publish Date - 2023-09-19T23:08:13+05:30 IST
అన్నమయ్య జిల్లా సహా తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో బైక్‌లను చోరీ చేస్తూ జల్సాగా తిరిగే ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను మంగళవారం జిల్లా పోలీసు లు అరెస్టు చేసి వారి నుంచి 10 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.

10 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
వివరాలు వెల్లడించిన డీఎస్పీ మహబూబ్‌బాషా
రాయచోటిటౌన్, సెప్టెంబరు 19: అన్నమయ్య జిల్లా సహా తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో బైక్‌లను చోరీ చేస్తూ జల్సాగా తిరిగే ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను మంగళవారం జిల్లా పోలీసు లు అరెస్టు చేసి వారి నుంచి 10 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయంలో డీఎస్పీ మహబూబ్‌బాషా మీడియాకు వెల్లడించిన వివరాల్లోకెళితే... రామాపురం మండలం రాచపల్లె గ్రామం చిన్నకోడివాండ్లపల్లె వాసి నాగేంద్రారెడ్డి కుమారుడు నెర్సుపల్లె సూర్యనారాయణరెడ్డి, సంబేపల్లె మండలం రౌతుకుం ట గ్రామం వంగిమళ్లవాండ్లపల్లెకు చెందిన, ప్రస్తుతం రాయచో టి పట్టణం మాసాపేటలో నివాసం ఉంటున్న రహీం కుమారు డు బొద్దికొండ షాజహాన్, బాలాజీ జిల్లా తిరుపతి పట్టణం సుందరయ్యనగర్‌కు చెందిన సుధాకర్ కుమారుడు ఇడగొట్టు అనిల్‌కుమార్ స్నేహితులు. జల్సాలకు అలవాటు పడిన వీరు ద్విచక్రవాహనాలను చోరీ చేసి అమ్మి వచ్చే సొమ్ముతో జల్సాలు చేస్తుండేవారు. ఈ క్రమంలోనే వీరు హైదరాబాదు, బెంగళూ రు, తిరుపతి, రాయచోటి పట్టణాల్లో 8 రాయల్ ఎన్‌ఫీల్డ్ వాహనాలను, ఒక అపాచీ, ఒక టీవీఎస్ ఎక్స్‌ఎల్ వాహనాన్ని చోరీ చేశారు.
తిరుపతి, బెంగళూరు సిటీలోని రామమూర్తినగర్, మడేవాలా, ఇందిరానగర్, మైకోలేవు, మహదేవపురం పోలీ్‌సస్టేషన్లు, హైదరాబాదు నగరంలోని సైబరాబాద్ సిటీ మాదాపూర్ పోలీ్‌సస్టేషన్, బాలాజీ జిల్లా తిరుపతి, అలిపిరి, తిరుచానూరు పోలీ్‌సస్టేషన్, రాయచోటి అర్బన్ పోలీ్‌సస్టేషన్‌లలో కేసులు ఉన్నాయి. ఈ క్రమంలో ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు రాయచోటి డీఎస్పీ పర్యవేక్షణలో అర్బన్ సీఐ సుధాకర్‌రెడ్డి, ఎస్ ఐ నరసింహారెడ్డి, క్రైమ్ పార్టీ సిబ్బంది మల్లికార్జున, భరక్‌తు ల్లా, మహేందర్‌నాయుడు రాయచోటి-రాజంపేట రోడ్డులోని సద్దికోళ్లవంక సమీప ఆంజనేయస్వామి గుడి వద్ద నిందితులను పట్టుకున్నారు. విచారణలో వారి వద్ద 10 ద్విచక్రవాహనాలు ఉన్నట్లు నేరం అంగీకరించడంతో నిందితులను కోర్టులో హాజరు పెట్టినట్లు డీఎస్పీ వివరించారు. అంతర్రాష్ట్ర బైకు దొంగలను అరెస్టు చేయడంలో కీలకపాత్ర పోషించిన అర్బన్ సీఐ సుధాకర్‌రెడ్డి, ఎస్‌ఐ నరసింహారెడ్డి, క్రైమ్ పార్టీ సిబ్బందిని అభినంది స్తూ రివార్డుల కోసం ఎస్పీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అర్బన్ సీఐ సుధాకర్‌రెడ్డి, ఎస్‌ఐ నరసింహారెడ్డి పాల్గొన్నారు.