ల్యాండ్‌ కన్వర్షన భూముల పరిశీలన

ABN , First Publish Date - 2023-03-18T23:29:39+05:30 IST

వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాల కోసం మార్చు కోవాలని అందిన దరఖాస్తుల మేరకు పీలేరు మం

ల్యాండ్‌ కన్వర్షన భూముల పరిశీలన
రికార్డులు పరిశీలిస్తున్న ఆర్డీవో రంగస్వామి

పీలేరు, మార్చి 18: వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాల కోసం మార్చు కోవాలని అందిన దరఖాస్తుల మేరకు పీలేరు మండలంలో శనివారం రాయచోటి ఆర్డీవో రంగస్వామి పర్యటించి పరిశీలించారు. పీలే రు మండలం గూడరేవుపల్లె, ఎర్రగుంటపల్లె పంచాయతీలకు చెందిన ఇద్దరు తమకున్న వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవ సరాల కోసం మార్పు చేసుకోవాలని దరఖాస్తు చేసుకోవడంతో ఆయన వాటిని పరిశీలించారు. దరఖాస్తుదారులు అందించిన రికార్డులు, రెవెన్యూ రికార్డులను సరిచూసుకోవ డమే కాకుండా క్షేత్రస్థాయిలో ఆ భూములను స్వయంగా చూశారు. కార్యక్రమంలో తహసీల్దారు రవి, ఆర్‌ఐ రాజశేఖర్‌, వీఆర్వోలు రెడ్డిరాణి, యోగానంద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-03-18T23:29:39+05:30 IST