శనగల కొనుగోలు కేంద్రం తనిఖీ
ABN , First Publish Date - 2023-03-19T00:30:49+05:30 IST
శనగల కొనుగోళ్ల కేంద్రాల్లో నాణ్యతా ప్రమాణాలను కచ్చింతంగా పాటించాలని మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ నరసింహారెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి నాగేశ్వరరావు ఆదేశించారు.

ఎర్రగుంట్ల, మార్చి 18: శనగల కొనుగోళ్ల కేంద్రాల్లో నాణ్యతా ప్రమాణాలను కచ్చింతంగా పాటించాలని మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ నరసింహారెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి నాగేశ్వరరావు ఆదేశించారు. శనివారం ఎర్రగుంట్ల మార్కెట్ యార్డులో కనీస మద్దతు ధర కొనుగొలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పారదర్శకంగా కొనుగోలు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి అవకతవకలకు పాల్పడరాదని సిబ్బందికి ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏవో శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.