చేతకాని ప్రభుత్వం వెంటనే గద్దె దిగిపోవాలి

ABN , First Publish Date - 2023-09-04T00:01:19+05:30 IST

ప్రజా సమస్యలు పరిష్కరించలేని వైసీపీ ప్రభుత్వం తక్షణం గద్దె దిగిపోవాలని వాల్మీకిపురం మండల టీడీపీ నాయకులు డిమాండ్‌ చేశారు.

చేతకాని ప్రభుత్వం వెంటనే గద్దె దిగిపోవాలి
వాల్మీకిపురం మండలం చింతపర్తి విద్యుత సబ్‌స్టేషన వద్ద ధర్నా చేస్తున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు

చింతపర్తి విద్యుత సబ్‌స్టేషన వద్ద ధర్నాలో టీడీపీ నేతలు

వాల్మీకిపురం, సెప్టెంబరు 3: ప్రజా సమస్యలు పరిష్కరించలేని వైసీపీ ప్రభుత్వం తక్షణం గద్దె దిగిపోవాలని వాల్మీకిపురం మండల టీడీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. అప్రకటిత విద్యుత కోతల తీరును నిరసిస్తూ ఆదివారం మండలంలోని చింతపర్తి గ్రామ విద్యుత సబ్‌స్టేషన వద్ద స్థానిక సర్పంచ మహిత శేషాద్రిరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నాయ కులు ధర్నా నిర్వహించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు జెండాలు చేతపట్టి వైసీపీ ప్రభుత్వానికి సీఎం జగనకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ వేళాపాళాలే ని విద్యుత కోతల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. మండలంలోని 16గ్రామాల పరిధిలో గత కొద్దిరోజు లుగా ఇష్టారాజ్యంగా విద్యుత సరఫరా నిలిపివేస్తుండటంతో పంటలు ఎండిపోయి రైతు లు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. నివాసాలకు కరెంట్‌ లేక రాత్రి సమయా లలో దోమల బెడదతో రోగాల బారిన పడుతున్నారన్నారు. విద్యుత సరఫరా సక్రమం గా ఇచ్చేలా చర్యలు చేపట్టని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం సబ్‌స్టేషన అధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయ కులు ద్వారకనాథరెడ్డి, గుడ్రెడ్డి చంద్రారెడ్డి, భాస్కర్‌రెడ్డి, కేవీరెడ్డి, మాజీ సర్పంచ రాజేం ద్రప్రసాద్‌, పీవీ నారాయణ, గాంధీపేట రమణ, ఆనంద్‌, కువైట్‌ ఆదినారాయణ, డిష్‌ బ్రదర్స్‌, దేవేంద్రరెడ్డి, శంకర్‌రెడ్డిడ, ఆదెన్న, వెంకటేష్‌, శివ, గంగాధర్‌రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, భాస్కర్‌, లక్ష్మీనారాయణ, టీడీపీ యూత సభ్యులు. కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-04T00:01:19+05:30 IST