చెన్నకేశవస్వామి మాన్యంలో ఆగని అక్రమ నిర్మాణాలు
ABN , Publish Date - Dec 17 , 2023 | 11:36 PM
వెల్లటూరు శ్రీచెన్నకేశవస్వామి ఆలయం మాన్యంలో అక్రమ నిర్మాణాలు ఆగడం లేదు.
పెండ్లిమర్రి, డిసెంబరు 17: వెల్లటూరు శ్రీచెన్నకేశవస్వామి ఆలయం మాన్యంలో అక్రమ నిర్మాణాలు ఆగడం లేదు. నవంబరు 30వ తేదీన ఆంధ్రజ్యోతి దినపత్రికలో చెన్నకేశవస్వామికి శఠగోపం రూ.2కోట్ల విలువై న స్థలం కబ్జా అనే కథనం ప్రచురితమవడంతో దేవదాయ అధికారులు స్పందించి రెవెన్యూ సిబ్బంది సహకారంతో కొలతలు వేసి హద్దులు వేశా రు.
అయితే ఇవేవీ మాకుపట్టవు అధికారం మాదే, మమ్మల్ని ఎవరూ ఆపలేరన్నట్లు ఆ గ్రామానికి చెందిన వైసీపీ నేతలు అక్రమ నిర్మాణాలు చేస్తూ అధికారులకు సవాల్ విసురుతున్నారు. పూర్వం ఎవరో దాతలు దానంగా ఇచ్చిన దేవుని మాన్యంపై దుర్మార్గుల కన్నుపడి వారి అధీనంలోకి తీసుకుని అక్రమ కట్టడాలు చేపట్టడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోంది.